ETV Bharat / bharat

మోదీ 'ప్రగతి' సమావేశం- కీలక ప్రాజెక్ట్​లపై సమీక్ష

14 రాష్ట్రాల్లో రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో కేంద్రం చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్​లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దీనితోపాటు 'వన్​ నేషన్ వన్​ రేషన్​ కార్డ్​' పథకంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

PM Modi reviews eight projects
కీలక ప్రాజెక్ట్​లపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష
author img

By

Published : Aug 25, 2021, 10:56 PM IST

'వన్​ నేషన్ వన్​ రేషన్​ కార్డ్​'(ఓఎన్​ఓఆర్​సీ) పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనితో పాటు 37వ ప్రగతి సమావేశంలో భాగంగా... 14 రాష్ట్రాల్లో సుమారు రూ.1.26 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన ఎనిమిది ప్రాజెక్ట్​లను మోదీ సమీక్షించారు. ఈ ప్రాజెక్టులపై అధికారులను వివరాలు అడిగి తెలుకున్నారు.

ఓఎన్​ఓఆర్​సీపై సమీక్షించిన మోదీ.. ఈ పథకం విస్తృత ప్రయోజనాలను ప్రజలకు అందించేలా చూడాలని అధికారులను కోరారు. ఇందుకుగానూ ఈ కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన సాంకేతిక ఫ్లాట్​ఫాంలను ఉపయోగించుకోవాలని సూచించారు. సకాలంలో ప్రాజెక్ట్​లను పూర్తిచేయాల్సి అవసరాన్ని అధికారులకు వివరించారు ప్రధాని నరేంద్రమోదీ.

ప్రధానమంత్రి సమీక్షించిన ఎనిమిది ప్రాజెక్ట్​ల్లో మూడు రైల్వే, మూడు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి కాగా మరో రెండు విద్యుత్​ శాఖకు చెందినవి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్​లు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, హరియాణా, ఛత్తీస్​గఢ్​, అరుణాచల్​ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, మణిపూర్, దిల్లీల్లో ఉన్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.

ఇదే క్రమంలో ఆక్సిజన్​ ప్లాంట్​ల నిర్మాణంపైనా సమావేశంలో ప్రధాని దృష్టిసారించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రగతి అనేది కేంద్ర రాష్ట్రప్రభుత్వాలతో కూడిన ప్రోయాక్టివ్​ గవర్నెన్స్​. ఇది ఇన్​ఫర్మేషన్​ అండ్​ కమ్యునికేషన్​ టెక్నాలజీ ఆధారంగా పని చేసే ఫ్లాట్​ఫాం.

ఇదీ చూడండి: 'పెగసస్​పై అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.