ETV Bharat / bharat

'దేశ సమగ్రతలో ఆయన కృషి చిరస్మరణీయం' - amit sha latest tweets

భారతీయ జన్​ సంఘ్​ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 68వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్​ ద్వారా నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ సమగ్రతను కాపాడేందుకు ముఖర్జీ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

Syama Prasad Mookerjee
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
author img

By

Published : Jun 23, 2021, 11:14 AM IST

Updated : Jun 23, 2021, 11:40 AM IST

దేశ సమగ్రతను కాపాడేందుకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన కృషి మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం.. భారతీయ జన్​ సంఘ్​ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 68వ వర్ధంతి సందర్భంగా.. ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు.

PM Modi tweet
ప్రధాని మోదీ ట్వీట్​

" శ్యామా ప్రసాద్ ముఖర్జీ గొప్ప ఆలోచనలు, ప్రజలకు సేవ చేయాలన్న తపన.. ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం."

-- ప్రధాని నరేంద్ర మోదీ

షా నివాళులు..

amit sha tweet
అమిత్​ షా ట్వీట్​

శ్యామా ప్రసాద్ ముఖర్జీకి కేంద్ర హోం మంత్రి.. అమిత్​ షా నివాళులు అర్పించారు.

" దేశ గుర్తింపు, సమగ్రతను ముఖర్జీ కాపాడారు. ఆయన సాంస్కృతిక భారత్ సిద్ధాంతకర్త. ప్రజల సహకారం లేనిది దేశం అభివృద్ధి చెందదని ముఖర్జీ నమ్మకం."

-- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

నడ్డా నివాళులు..

శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులు అర్పించారు. అధికరణ 370, 35ఏను రద్దు చేసేందుకు ముఖర్జీ.. ఓ ఉద్యమాన్నే ప్రారంభించారని నడ్డా తెలిపారు. దేశ సమగ్రత, కశ్మీర్ కోసం ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.

కేంద్ర మంత్రి డాక్టర్​. జితేంద్ర సింగ్ కూడా ట్విట్టర్ ద్వారా శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి: Congress: ప్రధానితో భేటీకి కాంగ్రెస్​ సిద్ధం

Last Updated : Jun 23, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.