పోర్ట్బ్లెయిర్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. సుభాష్ చంద్రబోస్‌ను స్మరించుకున్నారు. నేతాజీ త్రివర్ణ పతాకం మొదటిసారి ఆవిష్కరించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఈ ప్రాంతాన్ని పర్యటించినట్లు మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
"1943 డిసెంబర్ 30... దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ రోజు పోర్ట్ బ్లెయిర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. మొదటి సారి జాతీయ పతాకం ఎగిరి నేటికి 75 సంవత్సరాలు అయింది. నేడు పోర్ట్ బ్లెయిర్లో జెండా ఆవిష్కరించడం ఆనందంగా ఉంది".
-నరేంద్ర మోదీ, ప్రధాని.
నేతాజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు ప్రధాని మోదీ. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపనలో నేతాజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:'ధర్మెగౌడ ఆత్మహత్యపై ఉన్నత స్థాయి విచారణ'