ETV Bharat / bharat

అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మోదీకి రెండో స్థానం - ప్రధాని నరేంద్ర మోదీ లేటెస్ట్​ న్యూస్

ట్విట్టర్​లో 2021గానూ ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు మోదీ. టీమ్​ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(sachin tendulkar recent news)​ 35వ స్థానం దక్కించుకున్నారు.

pm modi
మోదీ
author img

By

Published : Nov 9, 2021, 6:15 PM IST

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో 2021కుగానూ ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi Recent News) రెండవ స్థానంలో నిలిచారు. వినియోగదారుల నిఘా కంపెనీ 'బ్రాండ్‌వాచ్‌'.. తమ వార్షిక సర్వే నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా గాయని 'టేలర్‌ స్విఫ్ట్‌' ఈ జాబితాలో తొలి స్థానం సంపాదించారు.

35వ స్థానంలో సచిన్‌..

భారత్‌ నుంచి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(sachin tendulkar recent news) ట్విట్టర్‌లో ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో తొలి 50వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. అమెరికా నటులు ద్వానే జాన్సన్, లియోనార్డో డి కాప్రియో, మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామాలను వెనక్కినెట్టి సచిన్‌ 35వ స్థానంలో నిలిచారు. సచిన్‌ దశాబ్దకాలంగా యునిసెఫ్‌ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, 2013లో ఆ సంస్థ దక్షిణాసియా రాయబారిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా సచిన్‌ సేవలను కొనియాడింది బ్రాండ్‌వాచ్‌.

'అణగారిన వర్గాల కోసం గళం విప్పుతూ ఆయన ప్రశంసనీయంగా పని చేస్తున్నారని పేర్కొంది. వాస్తవమైన లక్ష్యాల కోసం పని చేస్తున్నారని ప్రశంసించింది. సచిన్‌ నుంచి స్ఫూర్తి పొందిన ఆయన అభిమానులు ఆ సేవలను కొనసాగిస్తున్నారని' బ్రాండ్‌వాచ్‌ తెలిపింది.

ఇదీ చూడండి: ప్రపంచంలో మోదీనే నంబర్​-1.. రెండో స్థానం​ ఎవరిదంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.