ETV Bharat / bharat

'ఆత్మపరిశీలనకూ సమయం కేటాయించండి' - సెంటీన్నెల్​ ఫౌండేషన్​ డే లఖ్​నవూ వర్సిటీ

ప్రజలు డిజిటల్​ పరికరాలకు అలవాటు పాడి.. తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధాని మోదీ అన్నారు. అయితే తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. దీని వల్ల సామర్థ్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. లఖ్​నవూ విశ్వవిద్యాలయ 100ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi releases special stamp and Rs 100 coin to commemorate the Centennial Foundation Day of the University of Lucknow.
'ఆత్మపరిశీలనకు కూడా సమయం కేటాయించండి'
author img

By

Published : Nov 25, 2020, 7:03 PM IST

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. డిజిటల్​ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని... అత్మవిశ్వాసం, సామర్థ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు.

లఖ్​నవూ విశ్వవిద్యాలయం 100ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో వర్చువల్​గా పాల్గొన్నారు ప్రధాని. స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు రూపొందించాలి సలహా ఇచ్చారు.

"స్థానిక నైపుణ్యాన్ని విశ్లేషించి, స్థానిక వస్తువుల కోసం వర్సిటీ ఓ కోర్సును ఎందుకు రూపొందించకూడదు? తన పరిధిలోని జిల్లాల్లో వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకు కృషి చేయకూడదు? స్థానిక వస్తువులపై వర్సిటీ పరిశోధన చేయవచ్చు. ఓ స్థానిక వస్తువుకు సంబంధించి.. బ్రాండ్​, మార్కెటింగ్​, ఇతర వ్యూహాలపై ఓ కోర్సు ఉంటే బాగుంటుంది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వేడుక సందర్భంగా ప్రత్యేక స్టాంప్​తో పాటు 100 రూపాయల నాణాన్ని విడుదల చేశారు మోదీ.

pm-modi-releases-special-stamp-and-rs-100-coin-to-commemorate-the-centennial-foundation-day-of-the-university-of-lucknow
రూ. 100 నాణెం

వేడుకలో మోదీ

పుస్తకం విడుదల...

సిక్కు మత వ్యవస్థాపకులు గురునానక్​ దేవ్​ జీవితం, ఆయన సిద్ధాంతాలపై రచించిన పుస్తకాన్ని బుధవారం విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ పుస్తకాన్ని ఛండీగఢ్​వాసి కిర్​పాల్​ సింగ్​ రచించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ కూడా పాల్గొన్నారు.

పుస్తకం విడుదల చేస్తున్న ప్రధాని

ఇదీ చూడండి:- 'ఫార్ములా 23'తో భాజపా 'బంగాల్​ మిషన్​-200'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.