జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్రం మోదీ. సమాజ సంస్కరణలో ఆయన నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
"జ్యోతిరావు పూలే గొప్ప తత్వవేత్త, రచయిత. మహిళా విద్యావికాసానికి, సాధికారతకు విశేష కృషి చేశారు."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రాలో దళిత వర్గంలో జన్మించిన పూలే.. సామాజిక వివక్షకి వ్యతిరేకంగా పోరాడారు. అణగారిన కులాలకు విద్యను అందించడానికి కృషి చేశారు. ఈయన భార్య సావిత్రి బాయి పూలేతో కలిసి మహిళలు విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించారు.
ఇదీ చదవండి: 'అడుక్కోవడం నేరమా.. కాదా?'