నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 160వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్య్ర సమరయోధుడు గోపాల కృష్ణ గోఖలే, మహారాణా ప్రతాప్లకూ మోదీ నివాళులర్పించారు.
ఠాగూర్ ఆలోచనలు దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు. ఆయన కలలు కన్న భారతంగా దేశాన్ని తీర్చిదిద్దాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, దేశసేవ కోసం గోఖలే తన జీవితాన్ని అంకితం చేశారని మోదీ పేర్కొన్నారు.
మాహారాణా ప్రతాప్.. తన ధైర్యసాహసాలతో దేశానికి కీర్తి తెచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. జన్మభూమికి ఆయన చేసిన సేవ చిరస్మరణీయమని తెలిపారు.
ఠాగూర్ జన్మదినం మే 7 అయినప్పటికీ ఆయన జయంతిని బెంగాలీల క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తారు.
ఇదీ చదవండి:అసోం సీఎంగా హిమంత- రేపే ప్రమాణం!