ETV Bharat / bharat

వాజ్​పేయీకి ప్రముఖుల ఘన నివాళులు- సేవలను గుర్తు చేసుకున్న మోదీ - వాజ్​పేయీ రాజకీయ జీవితం

PM Modi Pays Tribute To Atal Bihari Vajpayee : బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ 99వ జయంతి సందర్భంగా దిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ఆయనకు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ సదైవ అటల్ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు.

PM Modi Pays Tribute To Atal Bihari Vajpayee

author img

By PTI

Published : Dec 25, 2023, 11:22 AM IST

Updated : Dec 25, 2023, 2:26 PM IST

వాజ్​పేయీకి ప్రముఖుల ఘన నివాళులు

PM Modi Pays Tribute To Atal Bihari Vajpayee : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 99వ జయంతి సందర్భంగా ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు దిల్లీలోని 'సదైవ్‌ అటల్‌'ను సందర్శించారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, తర్వాత ఉప రాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖడ్‌, ప్రధాని మోదీ ఇతర కేంద్ర మంత్రులు పూలతో అటల్ స్మారకానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాన్ని కొద్ది సేపు వీక్షించారు.

  • VIDEO | PM Modi pays tributes to former PM Atal Bihari Vajpayee at Sadaiv Atal in Delhi on his birth anniversary. pic.twitter.com/tJ4FfGRHGA

    — Press Trust of India (@PTI_News) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Delhi: Former President Ram Nath Kovind, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, Lok Sabha Speaker Om Birla, Rajya Sabha Deputy Chairman Harivansh and other leaders pay floral tribute to former Prime Minister Atal Bihari Vajpayee at 'Sadaiv Atal'… pic.twitter.com/CCFOopsJLO

    — ANI (@ANI) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాజీ ప్రధాని వాజ్​పేయీ ఆయన జీవితాంతం దేశాభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. అమృత్​కాల్ సమయంలో వాజ్‌పేయీ అంకితభావం, సేవ దేశానికి స్ఫూర్తిని కలిగిస్తాయని పోస్ట్​లో పేర్కొన్నారు. అలాగే స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మదన్​మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. మాలవీయ సాటిలేని వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుందని ట్వీట్ చేశారు.

  • #WATCH | Delhi: Visuals from 'Sadaiv Atal' memorial in Delhi where President Droupadi Murmu, Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi and several other leaders have paid floral tribute to former Prime Minister Atal Bihari Vajpayee on his birth anniversary. pic.twitter.com/8BwjNingMN

  • पूर्व प्रधानमंत्री आदरणीय अटल बिहारी वाजपेयी जी को उनकी जयंती पर देश के सभी परिवारजनों की ओर से मेरा कोटि-कोटि नमन। वे जीवनपर्यंत राष्ट्र निर्माण को गति देने में जुटे रहे। मां भारती के लिए उनका समर्पण और सेवा भाव अमृतकाल में भी प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/RfiKhMb27x

    — Narendra Modi (@narendramodi) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వాజ్​పేయీకి నీతీశ్ నివాళులు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీకి బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ పట్నాలోని అటల్ పార్క్ వద్ద నివాళులర్పించారు. 'ఈరోజు మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన ప్రభుత్వంలో నేను కేంద్ర మంత్రిగా పని చేశాను. అటల్​జీ నన్ను చాలా గౌరవించేవారు.' అని నీతీశ్ మీడియాతో చెప్పారు.

  • VIDEO | Bihar CM Nitish Kumar pays tributes to former PM Atal Bihari Vajpayee at Atal Park in Patna on his birth anniversary. pic.twitter.com/VBP6ILfiKx

నివాళులర్పించిన గోవా సీఎం సావంత్
మరోవైపు, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పనాజీలో వాజ్​పేయీ చిత్రపటానికి నివాళులర్పించారు. 'సుపరిపాలన దినోత్సవం' సందర్భంగా గోవా ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిందని చెప్పారు. వాజ్​పేయీ బీజేపీ నేతలందరికీ స్ఫూర్తిదాయకమని ప్రమోద్ సావంత్ అన్నారు.

  • #WATCH | Panaji: Goa CM Pramod Sawant participated in the 'Good Governance Day' celebrated in honour of the birth anniversary of former Prime Minister and Bharat Ratna Atal Bihari Vajpayee. pic.twitter.com/nH6Jz8H9ji

బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్​పేయీ బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ఆయన బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు. 1999 నుంచి 2004 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అనారోగ్యం పాలయ్యారు. 2018 ఆగస్టు 16న దిల్లీలోని ఎయిమ్స్​లో తుదిశ్వాస విడిచారు.

'కరోనా కొత్త వేరియంట్​తో భయం లేదు- వ్యాక్సిన్ ఎక్స్​ట్రా డోస్​ కూడా!'

లక్ష మందితో భగవద్గీత పారాయణం- శ్లోకాలతో మార్మోగిన పరేడ్ గ్రౌండ్స్- గిన్నిస్​ రికార్డు పక్కా!

Last Updated : Dec 25, 2023, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.