ETV Bharat / bharat

India 100 crore vaccine: ఆ యువతి పాట విన్న ప్రధాని! - కరోనా టీకా పంపిణీ

భారత్‌ 100 కోట్ల కరోనా టీకా డోసులు (India 100 crore vaccine) ఇచ్చి చరిత్ర సృష్టించిన రోజు ఛావి అగర్వాల్‌ అనే యువతికి చాలా ప్రత్యేకంగా మారింది. అందుకు కారణం ప్రధాని నరేంద్ర మోదీనే. అదెలాగంటారా?

chhavi agarwal modi
ఆ యువతి పాట విన్న ప్రధాని!
author img

By

Published : Oct 21, 2021, 7:49 PM IST

వంద కోట్ల టీకా డోసుల పంపిణీ రికార్డు నమోదైన (India 100 crore vaccine) సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. దిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. ఛావి అగర్వాల్‌(25) అనే యువతి కూడా టీకా వేయించుకునేందుకు అక్కడికి వచ్చారు. ఆమె అక్కడే ప్రాంగణంలో ఉండగా.. అటుగా వెళ్తున్న మోదీని చూసి, ఆనందంతో ఉబ్బితబ్బియ్యారు. పట్టలేని సంతోషంతో ప్రధానిని గట్టిగా పిలిచారు. తననెవరో పిలుస్తున్నారని, వెనక్కి తిరిగిన మోదీకి ఛావి కనిపించారు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు.

pm-modi-meets-special-girl-chhavi-agarwal
ఛావి అగర్వాల్​తో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

ఇంతకాలం ఎందుకు టీకా (Vaccination India) తీసుకోలేదని మోదీ ఆమెను ప్రశ్నించారు. దగ్గు కారణంగా కుదరలేదని చెప్పారు. అలాగే ఆమె ఇష్టాఇష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాటలు పాడటమంటే ఇష్టమని తెలుసుకొని.. ఒక పాట పాడించుకొని విన్నారు. ఆ అమ్మాయి అభ్యర్థన మేరకు ఆమెతో కలిసి ఒక ఫొటో కూడా తీసుకున్నారు. మళ్లీ త్వరలో కలుస్తానని మాట కూడా ఇచ్చారు. దాంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ఛావికి ఈ రోజు ప్రత్యేకంగా మారిపోయింది.

చరిత్ర

వ్యాక్సినేషన్​ (India vaccination status) ప్రక్రియలో చరిత్ర సృష్టిస్తూ... టీకా పంపిణీలో 100కోట్ల మార్కును (India 100 crore vaccine) అందుకుంది భారత్​(India vaccination count). జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంతో అక్టోబర్​ 21 నాటికి 100కోట్లకు చేరింది.

తాజా రికార్డుపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ కరోనా(Third wave in india) విజృంభించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం అంటున్నారు.

100కోట్లు ఇలా..

దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది(India vaccination status). 10కోట్ల మార్కును అందుకునేందుకు 85రోజులు పట్టింది. 20కోట్ల మార్కును 45రోజుల్లో, 30కోట్ల మార్కును 29రోజుల్లో దాటేసింది. ఆ తర్వాత టీకా పంపిణీలో భారత్​ దూసుకుపోయింది. 24 రోజుల తర్వాత 40కోట్ల డోసులు, 20రోజుల అనంతరం ఆగస్టు 6న 50కోట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత కేవలం 76రోజుల్లోనే 100కోట్ల (India 100 crore vaccine) మార్కును అందుకుంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.