PM Modi Meets Sikhs: ఫిబ్రవరి 20న పంజాబ్‌లో పోలింగ్ జరగనున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న సిక్కు ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సమావేశం దిల్లీలోని మోదీ నివాసంలో జరిగింది.
ఈ సమావేశంలో దిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్ సింగ్జీ సించేవాల్, మహంత్ కరమ్‌జీత్ సింగ్, కర్ణాల్కు చెందిన బాబా జోగాసింగ్, అమృత్‌సర్‌కు చెందిన డేరాబాబా తారాసింగ్.. తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీకి సిక్కులు పవిత్రమైన కిర్పన్(ఖడ్గం) అందజేశారు. పంజాబ్ ఎన్నికల్లో భాజపా, కెప్టెన్ అమరిందర్సింగ్కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఫిబ్రవరి 20న పంజాబ్ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంది.
ఇవీ చూడండి:
పంజాబ్ చతుర్ముఖ పోరులో గెలిచేదెవరు? కింగ్ మేకర్‌గా ఆ పార్టీ?
'రైతులకు నమ్మకద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది'
punjab assembly election: అంతర్గత కలహాలే.. అసలు సవాల్