ETV Bharat / bharat

షా, నడ్డాలతో మోదీ భేటీ.. అందుకేనా?

కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Jun 11, 2021, 9:21 PM IST

Updated : Jun 11, 2021, 10:09 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భాజపా అగ్రనేతలు సమావేశమయ్యారు. మోదీ సహా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

యూపీలో భాజపా పరిస్థితి, ఆ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భాజపాను పటిష్ఠం చేసే విధంగా కార్యాచరణపై చర్చలు జరిపినట్లు సమాచారం.

అలాగే.. కేంద్ర మంత్రులతోనూ ప్రధాని నరేంద్ర మోదీ.. తన నివాసంలో సమావేశమయ్యారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చించారు. ఈ సమావేశం ఐదు గంటలపాటు జరిగింది.

ఇదీ చదవండి : టీఎంసీలో చేరికపై ప్రణబ్​ కుమారుడి క్లారిటీ

Last Updated : Jun 11, 2021, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.