ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది చివరలో అమెరికాలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇటీవలే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ వర్చువల్‌గా హాజరైన నేపథ్యంలో ఈ పర్యటన అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
తొలుత 47వ జీ-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్.. మోదీని ఆహ్వానించారు. కానీ, కరోనా నేపథ్యంలో మోదీ ఈ సదస్సుకు హాజరుకావట్లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తి మొదలైన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించలేదు. ఈ ఏడాదిలో మొదటిసారిగా మార్చిలో బంగ్లాదేశ్‌కు వెళ్లారు.
ఇదీ చదవండి: