ETV Bharat / bharat

'తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణిచివేశాం- భారత్ సామర్థ్యానికి ఇదే నిదర్శనం' - నరేంద్ర మోదీ మన్​కీబాత్ 2023

PM Modi Mann Ki Baat Today : తీవ్రవాదాన్ని అన్ని విధాలుగా అణచివేసామని.. భారత్​ సామర్థ్యానికి ఇదే నిదర్శమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల పండుగల సందర్భంగా 4 లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగిందన్న ప్రధాని.. భారత్​లో తయారైన వస్తువులనే కొనుగోలు చేశారని మన్​కీబాత్​ కార్యక్రమంలో వెల్లడించారు.

PM Modi Mann Ki Baat Today
PM Modi Mann Ki Baat Today
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 1:04 PM IST

Updated : Nov 26, 2023, 2:01 PM IST

PM Modi Mann Ki Baat Today : భారత్‌ ఎదుర్కొన్న అత్యంత క్రూరమైన దాడుల్లో ముంబయి దాడులు కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దాడి నుంచి వేగంగా కోలుకుని తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణచివేశామని.. భారత్‌ సామర్థ్యానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మన్‌ కీ బాత్‌ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న ప్రధాని మోదీ.. ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు.

  • In Mann ki Baat, Prime Minister Narendra Modi says, "...The success of the 'Vocal for Local' campaign is opening doors for developed and prosperous India... It gives strength to the economy of the country... It guarantees the balanced development of the country... The 'Vocal for… pic.twitter.com/UEq36MEA7E

    — ANI (@ANI) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిందని గుర్తుచేశారు. 2015లో అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబరు 26నాడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపారు. ఇటీవల పండుగల సందర్భంగా 4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దేశంలో జరిగిందన్న ప్రధాని ఎక్కువ మంది భారత్‌లో తయారైన వస్తువులే కొనుగోలు చేశారని సంతోషం వ్యక్తంచేశారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే కొత్త సంస్కృతికి స్వస్తి చెప్పి దేశంలోనే వివాహాలు చేసుకోవాలని దేశ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.

  • In Mann ki Baat, Prime Minister Narendra Modi says, "... This is the second year in which the practice of paying in cash has decreased slowly on the occasion of Diwali... People are making digital payments more and more... You can do one more thing... You should decide that for… pic.twitter.com/HTbtCDGxZ0

"మీరే ఆలోచించండి. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త వాతావరణం సృష్టిస్తున్నాయి. అది అవసరమా? భారతగడ్డపై, భారతీయుల సమక్షంలో మనం పెళ్లిళ్లు చేసుకుంటే దేశ సంపద దేశంలోనే ఉంటుంది. దేశ ప్రజలకు కూడా మీ పెళ్లిళ్లలో సేవ చేసేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరముంది. పేద ప్రజలు కూడా తమ పిల్లలతో మీ పెళ్లిళ్ల గురించి చెబుతారు. ఎప్పుడంటే వోకల్ ఫర్ లోకల్‌ మిషన్‌ను విస్తరించేందుకు మీరు మీ పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలను దేశంలోనే నిర్వహించినపుడు. ఇది అనేక కుటుంబాలతో ముడిపడిన విషయం. నా బాధను ఆ కుటుంబాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాను."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

కొన్నాళ్ల క్రితం జరిగిన 100వ మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది కేవలం ఒక కార్యక్రమం కాదని.. తనకు విశ్వాసం ఇచ్చిన వేదికని అన్నారు. ప్రజలతో ఎలా అనుసంధానం అవ్వాలి అనే ప్రశ్నకు మన్‌ కీ బాత్‌ సమాధానం ఇచ్చిందని ఆయన వివరించారు. మోదీ మనసులో మాట అయిన మన్‌కీబాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోనూ మన్‌కీ బాత్‌ ప్రసారం చేశారు. పూర్తి స్టోరీ కోసం ఈ లింక్​ పై క్లిక్ చేయండి.

'అమరవీరుల కోసం 'మేరీ మాటి మేరా దేశ్‌'.. 7500 ప్రాంతాల నుంచి మట్టి, మొక్కలు'

Modi Mann Ki Baat : 'మహిళాశక్తికి 'చంద్రయాన్​-3' విజయం ప్రత్యక్ష ఉదాహరణ'

Last Updated : Nov 26, 2023, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.