ETV Bharat / bharat

'లోకల్​ను గ్లోబల్ చేద్దాం.. దేశం మీసం తిప్పుదాం!' - మన్​కీ బాత్ ఎగుమతులు

PM Modi Mann Ki Baat: దేశ పౌరులంతా స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తే.. అవే ప్రపంచవ్యాప్తమవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రైతులు, చిరు వ్యాపారుల కృషి వల్ల దేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. త్వరలోనే ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

PM Modi 'Mann Ki Baat'
PM Modi 'Mann Ki Baat'
author img

By

Published : Mar 27, 2022, 12:42 PM IST

PM Modi Mann Ki Baat: భారత దేశ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లు దాటాయని, దేశీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని చెప్పేందుకు ఇది నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు 'ఓకల్ ఫర్ లోకల్'కు ప్రాధాన్యమిస్తే.. ఈ స్థానిక ఉత్పత్తులే ప్రపంచవ్యాప్తమవుతాయని అన్నారు. మన్​కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ... ఎగుమతుల ద్వారా భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటినట్లైందని చెప్పారు.

"రైతులు, ఇంజినీర్లు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈ రంగాలు, కళాకారులు దేశం పటిష్ఠంగా మారడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి శ్రమ, కృషి వల్లే దేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించింది. ఇదేదో ఆర్థికపరమైన విషయం కాదు. ఇది భారత శక్తిసామర్థ్యాలకు సంబంధించిన విషయం. దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు.. ప్రపంచంలోని అన్ని దిశలకు వ్యాపిస్తున్నాయి. మన లోకల్​ను గ్లోబల్​గా మార్చుదాం. దేశీయ ఉత్పత్తులకు ఉన్న ప్రతిష్ఠను మరింత పెంచుదాం. భారత్​లో తయారైన ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందంటే.. దేశీయ సప్లై చైన్ రోజురోజుకూ బలంగా తయారవుతోందని అర్థం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఆశయాల కన్నా సంకల్పం గొప్పదైతే దేశం నూతన శిఖరాలకు చేరుకుంటుందని మోదీ అన్నారు. సంకల్పంతో పగలూ, రాత్రి తేడా లేకుండా పనిచేస్తే.. ఆశయాలు సాకారమవుతాయని చెప్పుకొచ్చారు. దేశంలో తయారైన ప్రతి వస్తువు విదేశీ గడ్డపై లభిస్తోందని అన్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వ ఈ-మార్కెట్ పోర్టల్ ద్వారా.. రూ.లక్ష కోట్ల విలువైన ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. 1.25 లక్షల మంది చిరువ్యాపారులు ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించారని వెల్లడించారు. ఇప్పుడు దేశానికి పెద్ద ఆశయాలు మాత్రమే కాకుండా.. వాటిని సాధించే ధైర్యం కుడా లభించిందని మోదీ అన్నారు. ఈ ధైర్యసాహసాలతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: పీహెచ్​డీ దళిత విద్యార్థినిపై అత్యాచారం.. నలుగురు కలిసి రెండేళ్లు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.