ETV Bharat / bharat

PM Modi Mahabubnagar District Tour : మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.13,500 కోట్ల విలువైన పనులకు శ్రీకారం - PM Modi Telangana Tour

PM Modi Mahabubnagar District Tour : మహబూబ్​నగర్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

BJP Palamuru PrajaGarjana Public Meeting
PM Modi Telangana Tour
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 3:24 PM IST

Updated : Oct 1, 2023, 8:42 PM IST

PM Modi Mahabubnagar District Tour Updates : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభావేదిక పై నుంచి రూ.13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. వర్చువల్‌గా అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్‌ మల్టీ ప్రొడక్ట్‌ పైప్‌లైన్‌ను ప్రారంభించారు.

రూ.2,457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట-ఖమ్మం హైవేకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టారు. జక్లేర్-కృష్ణ కొత్త లైన్ జాతికి అంకితం చేశారు. కాచిగూడ-రాయచూర్-కాచిగూడ డెమో సర్వీస్ ప్రారంభించారు. హసన్-చర్లపల్లి హెచ్‌పీసీఎల్ ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం చేసిన ప్రధాని.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భవనాలు వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు.

PM Modi Inaugurated Kacheguda Yeswantapur Vande Bharat Train : 'బీజేపీ ప్రభుత్వం.. రైల్వేలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది'

PM Modi Telangana Tour : తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉందని చెప్పారు. ఎరువులపై సబ్సీడి రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోందని వివరించారు. రూ.13,500 కోట్లకు సంబంధించిన పనులకు మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ.30,000 కోట్లు కేటాయించిందని కిషన్​రెడ్డి వెల్లడించారు.

Modi Tour in Warangal : భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మోదీ

Kishan Reddy Fires on KCR : హైదరాబాద్‌ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్ రింగ్‌రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయని కిషన్​రెడ్డి తెలిపారు. రీజనల్‌ రింగ్‌రోడ్డు చుట్టూ రైల్వే లైన్‌ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. రీజనల్‌ రింగ్‌రోడ్డు కోసం కేంద్రం రూ.26,000 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మోదీ వస్తే.. సీఎం కేసీఆర్‌ (KCR ) ప్రధానిని కూడా కలవటం లేదని విమర్శించారు. కేసీఆర్ వైఖరితో తెలంగాణ నష్టపోతోందని.. 9 ఏళ్లల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్​రెడ్డి వివరించారు.

తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంది. ఎరువులపై సబ్సీడి రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోంది. రూ.13,500 కోట్లకు సంబంధించిన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం రూ.30,000 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్ రింగ్‌రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయి. - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

PM Modi Mahabubnagar District Tour మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోదీ పర్యటన

Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్‌ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం'

PM Modi Warangal Tour : దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర: మోదీ

Last Updated : Oct 1, 2023, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.