Major Dhyan Chand Sports University: ఉత్తర్‌ప్రదేశ్‌లో గత పాలకులు.. నేరస్థులకు అండగా నిలిచారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం.. ఇప్పుడు నేరస్థులను జైళ్లల్లో పెట్టి ఆటాడుకుంటోందని ప్రశంసించారు.
మేరఠ్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
"గత పాలకుల రాజ్యంలో.. నేరస్థులు వారికి ఇష్టమొచ్చినట్టుగా ఆడుకున్నారు. అక్రమాలపై టోర్నమెంట్లు నిర్వహించుకునేవారు. మేరఠ్, పరిసర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇళ్లు తగలబడుతున్న దృశ్యాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. గత ప్రభుత్వాల వల్లే ప్రజలు సొంత ఇళ్లను వదులుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. అలాంటి నేరస్థులతో.. యోగి ప్రభుత్వం ఇప్పుడు జైళ్లల్లో ఆటాడుకుంటోంది. ఐదేళ్ల క్రితం ఇక్కడి ఆడబిడ్డలు.. సాయంత్రం వేళ బయటకు వెళ్లేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు వారందరూ దేశానికే గర్వకారణంగా నిలిస్తున్నారు."
--- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
సకల వసతులతో..
సాల్వా, కైలీ గ్రామాల వద్ద రూ.700 కోట్ల అంచనా వ్యయంతో ఈ వర్సిటీని నిర్మించనున్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయంలో.. హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, టెన్నిస్ మైదానాలు, జిమ్నాసియం హాల్, రన్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ వంటి క్రీడావసతులను ఏర్పాటు చేయనున్నారు. షూటింగ్, జిమ్నాస్టిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ వంటి ఇతర క్రీడా సౌకర్యాలను నెలకొల్పనున్నారు. 540 మంది పురుషులు, 540 మంది మహిళా క్రీడాకారులకు శిక్షణనిచ్చే సామర్థ్యంతో ఈ యూనివర్సిటీని నిర్మిస్తున్నారు.
PM Modi in Meerut:
అంతకుముందు... మేరఠ్‌లో షహీద్ స్మారక్ వద్ద స్వాతంత్య్ర యోధులకు నివాళులు అర్పించారు మోదీ. అక్కడే ఉన్న మ్యూజియంను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో కలిసి సందర్శించారు.
ఇవీ చూడండి: