ETV Bharat / bharat

తమిళ భాషపై మోదీ ప్రశంసలు... రూ.31వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

author img

By

Published : May 26, 2022, 10:23 PM IST

PM Modi in Tamil Nadu: తమిళనాడులో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అక్కడి భాషపై ప్రశంసలు కురిపించారు. తమిళ భాష, అక్కడి ప్రజల సంస్కృతి విశ్వవ్యాప్తమైందని అన్నారు. మరోవైపు, సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆదుకుంటున్నట్లు తెలిపారు.

pm-modi
pm-modi

Modi Tamil Nadu speech: తమిళ భాషా సంస్కృతులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాష శాశ్వతమైనదని, అక్కడి ప్రజల సంస్కృతి విశ్వవ్యాప్తమైందిగా పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ తమిళనాడుకు చెందిన పౌరులు ప్రతిభ కనబరుస్తున్నారని.. ఇటీవల జరిగిన డెఫెలింపిక్స్‌లో భారత్‌ 16 పతకాలు సాధించగా.. అందులో ఆరు పతకాలు తమిళనాడు యువతే కైవసం చేసుకున్నారని కొనియాడారు. గురువారం హైదరాబాద్‌ పర్యటన ముగించుకొని నేరుగా చెన్నైకి చేరుకున్న ప్రధాని అక్కడ దాదాపు రూ.31వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు.

Modi in Tamil Nadu 2022: ఈ సందర్భంగా చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. తమిళ భాష, సంస్కృతులను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందరి.. ఈ జనవరిలో సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్లాసికల్‌ తమిళ్‌ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్యాంపస్‌ను పూర్తిగా కేంద్రం నిధులతోనే ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దేశంలోని పలు చోట్ల మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసి, తద్వారా దేశ వాణిజ్య పర్యావరణ వ్యవస్థలో కీలక రూపును తీసుకురానున్నట్టు తెలిపారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు దేశ ఆత్మనిర్భరతకు దోహదం చేస్తుందన్నారు. మౌలికవసతుల కల్పనకు ప్రాముఖ్యతను ఇచ్చిన దేశాలు.. అభివృద్ధి చెందుతున్న దశ నుంచి అభివృద్ధి చెందిన దేశాలుగా మారాయన్నారు. తమ ప్రభుత్వం అత్యున్నత నాణ్యతతో కూడిన మౌలికవసతుల కల్పనకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

శ్రీలంకను ఆదుకుంటున్నాం..
బెంగళూరు- చెన్నై మధ్య ఎక్స్‌ప్రెస్‌వే రెండు కీలక అభివృద్ధి కేంద్రాలను కలుపుతోందని ప్రధాని అన్నారు. చెన్నై పోర్ట్‌ను మధురవాయల్‌కు అనుసంధానించే నాలుగు లైన్ల ఎలివేటెడ్ రహదారి చెన్నై పోర్టును మరింత సమర్థంగా తీర్చిదిద్దడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తుందని చెప్పారు. శ్రీలంక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో అండగా నిలబడుతున్నామన్నారు. అక్కడి క్లిష్ట పరిస్థితులతో తమిళ ప్రజలు ఆందోళన చెందుతున్నారని తనకు అర్థమైందని.. పొరుగున ఉన్న, భారత్‌కు సన్నిహిత దేశమైన శ్రీలంక ఆర్థిక సహాయంతో పాటు ఆహారం, ఔషధాలు, పలు రకాల నిత్యావసర వస్తువులను కేంద్రం అందిస్తోందని చెప్పారు.

కొత్త ప్రభుత్వం వచ్చాక తొలిసారి..
తమిళనాడులో గతేడాది డీఎంకే సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం స్టాలిన్‌ ఘన స్వాగతం పలికారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చెన్నైలో దాదాపు 20వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. బెంగళూరు-చెన్నై మధ్య నిర్మిస్తున్న 262 కి.మీల ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా భాజపా కార్యకర్తలు పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ సాంస్కృతిక ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.