ETV Bharat / bharat

చారిత్రక ఘట్టం: టీకా పంపిణీకి మోదీ శ్రీకారం

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్​లో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలి దశలో మొత్తం 3 కోట్ల మందికి టీకా ఇవ్వాలని కేంద్రం సంకల్పించింది.

PM Modi
చారిత్రక ఘట్టానికి మోదీ శ్రీకారం- టీకా పంపిణీ షురూ
author img

By

Published : Jan 16, 2021, 11:08 AM IST

Updated : Jan 16, 2021, 11:48 AM IST

కొవిడ్‌ మహమ్మారిపై పోరులో నెలలుగా ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా చారిత్రక ఘట్టానికి తెరలేచింది. ఏడాదికి పైగా వేధిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా.. దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 3 వేల 6 కేంద్రాలలో 3 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది.

వర్చువల్ విధానంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన మోదీ.. పలువురు టీకా లబ్ధిదారులతో ముచ్చటిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

టీకాలు వేయించుకునేందుకు తరలివచ్చిన ఆరోగ్య కార్యకర్తలకు సిబ్బంది చప్పట్లు కొడుతూ స్వాగతం పలికారు. కరోనా టీకా కేంద్రాలను సుందరంగా అలంకరించారు. కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం టీకా కేంద్రాలను సుందరంగా అలంకరించారు. భద్రతా చర్యలు తీసుకుంటూ ఏర్పాట్లు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, బిహార్‌, జార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో టీకా కేంద్రాల అలంకరణ ఆకట్టుకుంది.

మొదటి విడతలో 3 కోట్ల మందికి..

దశలవారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగనుండగా మొదటి విడతలో కోటి మంది ఆరోగ్యరంగ కార్యకర్తలకు, 2కోట్ల మంది కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకాలు వేయాలని.. కేంద్రం సంకల్పించింది. యాభై ఏళ్లు పైబడినవారికి, యాభై ఏళ్లు లోపు ఉండి దీర్ఘకాలికసమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి తర్వాతి దశలో టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఆరోగ్య రంగ కార్యకర్తలకు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు వేసే టీకాల ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.

అత్యంత జాగ్రత్తగా..

ప్రతి కేంద్రంలోనూ.. సుమారు వందమంది లబ్ధిదారులకు టీకాలు వేయనున్నారు. అవసరమైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాలకు చేరవేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన ఆన్‌లైన్ డిజిటల్ ఫ్లాట్‌ఫాం కొ-విన్ యాప్‌ ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ.. నిర్వహించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాల నివృత్తికి 24 గంటలు పనిచేసే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1075ను ఏర్పాటు చేశారు.

కరోనా వ్యాక్సినేషన్‌కి సంబంధించి.. ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం రెండు డోసుల్లోనూ ఒకే కంపెనీ టీకా తీసుకోవాలని, గర్భిణులు, బాలింతలకు టీకాలు వేయరాదని స్పష్టం చేసింది. 18 ఏళ్లు, ఆ పైబడిన వారికే వ్యాక్సిన్ వేయాలని పేర్కొంది. కరోనా లక్షణాలు ఉన్నవ్యక్తులు , కరోనా బారినపడి ప్లాస్మా చికిత్స తీసుకున్న వ్యక్తులు, ఇతర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరినవారికి కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాత మాత్రమే టీకా వేయాలని సూచించింది. టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్‌ తీసుకోవచ్చని మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇవీ చూడండి:

'స్పుత్నిక్​-వీ' మూడో దశ ట్రయల్స్​కు డీసీజీఐ అనుమతి

కొవాగ్జిన్ గురించి ఈ విషయాలు తెలుసా?

Last Updated : Jan 16, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.