ETV Bharat / bharat

'గోవాలో డబుల్​ ఇంజన్​ వేగంతో అభివృద్ధి పరుగులు' - ఆత్మనిర్భర భారత్​ లబ్ధిదారులతో మోదీ సమావేశం

గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆత్మనిర్భర భారత్ స్వయంపూర్ణ గోవా' అనే కార్యక్రమ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను గోవా ప్రభుత్వం నూటికి నూరు శాతం అమలు చేస్తోందని కితాబిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒకే పార్టీ ఉండడంతో అభివృద్ధి డబుల్​ ఇంజన్​ రైలులా పరుగులు తీస్తుందని అన్నారు.

PRIME MINISTER
మోదీ
author img

By

Published : Oct 23, 2021, 12:33 PM IST

Updated : Oct 23, 2021, 1:04 PM IST

గోవాలోని ఆత్మనిర్భర భారత్​ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. కేంద్రం సహకారంతో గోవా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆత్మనిర్భర భారత్ స్వయంపూర్ణ గోవా' అనే కార్యక్రమం ద్వారా లబ్ధి పొందిన వారితో వర్చువల్​గా మాట్లాడారు మోదీ.

"గోవా ప్రభుత్వం తీసుకొచ్చిన స్వయంపూర్ణ అనే పథకం మహిళాసాధికారతకు కృషి చేస్తుంది. కేంద్రలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంది. దీంతో గోవాలో అభివృద్ధి డబుల్​ ఇంజన్​ రైలు వేగంతో పరుగులు పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతీ పథకం గోవాలో అమల్లో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోల్చితే అభివృద్ధికి చిరునామాగా నిలుస్తోంది. దేశ పర్యటక రంగంలో గోవా ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా.. సహజ సిద్ధంగా ఏర్పడిన మౌలిక సదుపాయాలు రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు సరిపడా ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. గోవాలో ఈ ఏడాది గ్రామీణ మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం నిధులను ఐదు రెట్లు పెంచాం."

- నరేంద్ర మోదీ, ప్రధాని

ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్వయంపూర్ణ గోవా అనే కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం అక్టోబర్​ 1, 2020న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గానూ రాష్ట్ర ప్రభుత్వం.. స్వయంపూర్ణ అనే పేరుతో ఓ ప్రత్యేకాధికారిని నియమించింది. ఇతను క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరిస్తారు.

ఇదీ చూడండి: Azadi ka Amrit Mahotsav: జాతీయోద్యమంలో 'చాయ్​' పాత్ర గురించి మీకు తెలుసా?

Last Updated : Oct 23, 2021, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.