Modi interacted with District Magistrates: దేశంలో ఉన్న ఆశావహ జిల్లాలు అభివృద్ధికి ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశ వృద్ధిలో ఇవి కీలకంగా మారాయని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలుపై.. కలెక్టర్లు, కొందరు సీఎంలతో ప్రధాని వర్చువల్గా సమావేశమయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక అధికార యంత్రాంగం కలసి పనిచేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
"నేడు దేశ పురోభివృద్ధిలో ఉన్న అవరోధాలను ఆశావహ జిల్లాలు తొలగిస్తున్నాయి. మీ (కలెక్టర్ల) అందరి కృషితో ఆశావహ జిల్లాలు ఆటంకాలకు బదులు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. ఆశావహ జిల్లాల వృద్ధికి పరిపాలనతో పాటు ప్రజల సహకారం కూడా చాలా ముఖ్యం. మెరుగైన పరిపాలనకు సాంకేతికత, ఆవిష్కరణలు చాలా ముఖ్యం."
- నరేంద్ర మోదీ, ప్రధాని
ఆశావహ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు వారి జీవితాలు అభివృద్ధి చెందడం చూసి ఎంతో ఆనందంగా ఉన్నారని మోదీ అన్నారు. కలెక్టర్లు ఇతర జిల్లాల విజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. అలానే భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా అంచనా వేయాలన్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'సీఎం అభ్యర్థి నేనే' అని హింట్ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక