ETV Bharat / bharat

'ఉగ్రవాదులంటే ఆ పార్టీలకు జాలి.. కేసుల ఎత్తివేతకు యత్నం'

PM Modi in Hardoi: ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయ్​ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ వరుస బాంబు దాడులను గుర్తు చేసుకున్నారు. అలాంటి దాడులు చేస్తున్న ఉగ్రవాదుల పట్ల కొన్ని పార్టీలు సానుభూతి చూపుతున్నాయని విమర్శించారు. యూపీలో ఉగ్రచర్యలకు పాల్పడిన వారిపై కేసులను కొట్టివేసేందుకు ఎస్పీ ప్రభుత్వం ప్రయత్నించినట్లు ఆరోపించారు.

pm-modi-in-hardoi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 20, 2022, 4:07 PM IST

Updated : Feb 20, 2022, 6:49 PM IST

PM Modi in Hardoi: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్​ బాంబు దాడులను గుర్తు చేసుకున్నారు. అలాంటి దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల పట్ల కొన్ని పార్టీలు సానుభూతి చూపుతున్నాయని ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన కొన్ని ఉగ్రదాడులకు కారణమైన వారిపై కేసులను కొట్టివేయాలని అప్పటి సమాజ్​వాదీ పార్టీ ప్రయత్నించినట్లు చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్​, హర్దోయ్​ నియోజకవర్గంలో నిర్వహించి బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులు చెరిగారు మోదీ. నాటు తుపాకులను ఉపయోగించే వారిని సమాజ్​వాదీ ప్రభుత్వం ఏ విధంగా స్వేచ్ఛగా తిరగనిచ్చిందో హర్దోయ్​ ప్రజలు గమనించినట్లు చెప్పారు.

" 2014-17 వరకు ఈ కుటుంబ పాలకులు నాకు మద్దతు ఇవ్వకపోవటం చాలా బాధగా అనిపించింది. నేను యూపీ నుంచి ఎంపీని, కానీ 2017 వరకు అప్పటి ప్రభుత్వం ప్రజల కోసం పని చేసేందుకు అనుమతించలేదు. వారిని మరోమారు అధికారంలోకి తీసుకొస్తే.. మీకోసం నన్ను పని చేయనిస్తారా? అలాంటి వారు మళ్లీ ఎన్నికవటం అవసరమా? అలాంటి కుటుంబ పాలకులు కులం పేరుతో విషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వారు కూర్చీ కోసం సొంత కుటుంబంతోనే గొడవపడతారు. మీరు ఓటు వేసి గెలిపించే డబుల్ ఇంజిన్​ ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదు. మన ప్రభుత్వం పేదలు, రైతులు, యువత కోసం ఏర్పడింది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

హర్దోయ్​ ప్రజలు ఈ ఏడాది రెండు సార్లు హోలీ నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు మోదీ. మార్చి 10న భాజపా భారీ మెజారిటీతో విజయం సాధించిన రోజును తొలి హోలీగా చేసుకుంటారని చెప్పారు. అయితే, మార్చి 10న హోలీ చేసుకోవాలంటే.. పోలింగ్​ బూత్​ల వద్ద తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

అఖిలేశ్​ యాదవ్​పై విమర్శలు..

ఉన్నావ్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఓ ముఖ్యమంత్రి అభ్యర్థి తన గెలుపుపై అభద్రతాభావంతో ఉన్నారని ఆరోపించారు. పార్టీని చేజిక్కించుకునేందుకు తండ్రినే అవమానించి.. ఇప్పుడు ఓటమి నుంచి కాపాడాలని ఆయన్ను వేడుకుంటున్నారని విమర్శించారు. 2017లో జరిగిన ఓ సంఘటన వీడియోను చూపిస్తూ ఈ ఆరోపణలు చేశారు మోదీ. అఖిలేశ్​ పోటీ చేస్తున్న కర్హాల్​ స్థానాన్ని ఉద్దేశిస్తూ.. సురక్షితమైనదిగా భావించిన స్థానం కూడా అందకుండా పోతుందన్నారు.

ఇదీ చూడండి: యూపీ, పంజాబ్ ఎన్నికలు... ఉత్సాహంగా తరలిన ఓటర్లు

Last Updated : Feb 20, 2022, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.