ETV Bharat / bharat

70 దేశాలకు 5.8కోట్ల భారత టీకాలు: మోదీ - modi news latest

కరోనా కష్టాలను ఎదుర్కొంటూనే భారత్​ ఇతర దేశాలకు సాయంగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటి వరకు 70 దేశాలకు 5.8 కోట్ల టీకా డోసులను చేరవేసిందని తెలిపారు. ఫిన్​లాండ్ ప్రధాని సన్నా మారిన్​తో ఆయన వర్చువల్​గా సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.

PM Modi holds virtual summit with Finnish counterpart
70 దేశాలకు 5.8కోట్ల భారత టీకాలు: మోదీ
author img

By

Published : Mar 16, 2021, 7:41 PM IST

భారత్​ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు 5.8కోట్ల టీకా డోసులను చేరవేసిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఓ వైపు కరోనా కష్టాలను ఎదుర్కొంటూనే ఇతర దేశాల అవసరాలను తీర్చిందని చెప్పారు. ఫిన్​లాండ్​ ప్రధాని సన్నా మారిన్​తో మోదీ వర్చువల్​గా సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

భారత్, ఫిన్​లాండ్​ నియమాల ఆధారిత, పారదర్శక, మానవతా, ప్రజాస్వామ్య ప్రపంచ క్రమాన్ని విశ్వసిస్తాయని మోదీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, క్లీన్​ ఎనర్జీ, పర్యావరణం, విద్య వంటి రంగాల్లో ఇరు దేశాలు బలమైన సహకారాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ఇంటర్నేషనల్​ సోలార్ అలియన్స్​, డిజాస్టర్​ రెసిలియంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​లో చేరాలని ఫిన్​లాండ్​ ప్రధానిని మోదీ కోరారు. ఈ రెండు సంస్థలు భారత్​ ప్రతిపాదన మేరకు ఏర్పడ్డాయి. ఫిన్​లాండ్​ సామర్థ్యం, నైపుణ్యాల ద్వారా ఈ రెండు సంస్థలు ప్రయోజనం పొందుతాయని మోదీ అన్నారు.

విద్య, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవకాశం ఉందని ఫిన్​లాండ్ ప్రధాని సన్నా మారిన్ చెప్పారు.

ఇదీ చూడండి: 'దేశద్రోహం'పై లోక్​సభలో మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.