Ukraine crisis: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ దేశంలో తాజా పరిస్థితులు, భారతీయుల తరలింపు ప్రక్రియ తదితర అంశాలపై మాట్లాడినట్లు సమాచారం. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ సెక్రెటరీ హర్షవర్ధన్ ష్రింగ్లా సహా ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. దిల్లీ చేరుకున్న వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
-
#WATCH | PM Narendra Modi chairs a high-level meeting on the Ukraine issue. pic.twitter.com/eJELxgnqmO
— ANI (@ANI) February 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | PM Narendra Modi chairs a high-level meeting on the Ukraine issue. pic.twitter.com/eJELxgnqmO
— ANI (@ANI) February 27, 2022#WATCH | PM Narendra Modi chairs a high-level meeting on the Ukraine issue. pic.twitter.com/eJELxgnqmO
— ANI (@ANI) February 27, 2022
రష్యా సైనిక చర్య చేపట్టిన క్రమంలో ఉక్రెయిన్లో పెద్ద సంఖ్యలో భారతీయులు ముఖ్యంగా విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇప్పటికే వారిని తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 900కుపైగా భారత పౌరులను స్వదేశానికి చేర్చారు. మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడిన మోదీ.. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, శాంతి కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.
ఇదీ చూడండి: రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అంగీకారం- వేదిక అదే..