ETV Bharat / bharat

గగన యోధులకు కోవింద్, మోదీ సలాం - వాయుసేన దినోత్సవం

శత్రువులను గగనతలంలోనే మట్టుబెట్టి, వెన్నులో వణుకు పుట్టించే సత్తా మన భారత వైమానిక దళానిది. పోరాటాల్లోనే కాదు, ప్రకృతి విపత్తు సమయాల్లోనూ భారత వాయిసేన అందించే సేవలు ఎంతో విశిష్టమైనవి. అంతటి ఘన చరిత్ర గల భారత వైమానిక దళ 89వ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు.

Air Force Day
వైమానిక దళ దినోత్సవం
author img

By

Published : Oct 8, 2021, 9:01 AM IST

Updated : Oct 8, 2021, 10:01 AM IST

భారత వైమానిక దళ 89వ వార్షికోత్సవాన్ని(Air Force Day 2021) పురస్కరించకుని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వాయుసేన యోధులకు శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లోనూ.. మానవతా సేవలోనూ భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందని మోదీ ట్విట్టర్​ వేదికగా కొనియాడారు.

"వైమానిక దళ దినోత్సవం సందర్భంగా వాయుసేన యోధులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత వైమానిక దళం.. ధైర్యసాహసాలు, శ్రద్ధ, నైపుణ్యాలకు పర్యాయపదం. దేశాన్ని రక్షించడమే కాకుండా.. విపత్కర పరిస్థితుల్లో మానవతా సేవలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు."

- ప్రధాని నరేంద్ర మోదీ

భారత వాయుసేన దినోత్సవం నాడు (Indian air force day 2021) వైమానిక సిబ్బంది, వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు రాష్ట్రపతి కోవింద్​.

"వైమానిక దినోత్సవం సందర్భంగా వైమానిక యోధులు, అనుభవజ్ఞులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. శాంతి, యుద్ధ సమయంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న భారత వైమానిక దళం పట్ల దేశం గర్వపడుతుంది. ఐఏఎఫ్​ తన ప్రతిష్టాత్మకమైన అత్యుత్తమ ప్రమాణాలను కొనసాగిస్తుందని నేను భావిస్తున్నాను."

- రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ట్విట్టర్​ వేదికగా భారత వాయుసేన దినోత్సవ(Indian air force day 2021) శుభాకాంక్షలు తెలిపారు. గగన యోధులకు, వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు.

  • Greetings and warm wishes to all #IndianAirForce personnel & their families on the 89th anniversary of this indomitable force. We are proud of our airwarriors for responding to varied challenges with alacrity and resilience & being steadfast in the service to the Nation. @IAF_MCC pic.twitter.com/gnpbrKJoL8

    — Rajnath Singh (@rajnathsingh) October 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"అజేయమైన వైమానిక శక్తి 89వ వార్షికోత్సవం సందర్భంగా వాయుసేన సిబ్బందికి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. హృదయపూర్వక అభినందనలు. ఆపత్కాల పరిస్థితుల్లో ధైర్య పరాక్రమాలతో స్థిరంగా పోరాడటమే కాకుండా.. విధి నిర్వహణలో ఎదురైనా సవాళ్లకు దీటుగా ప్రతిస్పందించే వాయుసేనను చూసి గర్వపడుతున్నా."

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

అద్భుత విన్యాసాలు

భారత వైమానికదళ దినోత్సవం(Indian air force day 2021) సందర్భంగా దిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ బేస్‌లో విన్యాసాలు నిర్వహించింది వాయుసేన. యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లతో వివిధ రూపాల్లో అద్భతంగా విన్యాసాలు చేశారు వైమానిక సిబ్బంది. ఈ కార్యక్రమంలో ఇటీవలే వైమానికదళంలో చేరిన రఫెల్, తేజస్ యుద్ధ విమానాలు కూడా పాల్గొన్నాయి.

Air Force Day
యుద్ధ విమానాలతో వైమానిక విన్యాసాలు
Air Force Day
వాయుసేన విన్యాసాలు

ఇదీ చూడండి: సరిహద్దులో భారత్​, చైనా సైనికుల మధ్య ఘర్షణ!

Last Updated : Oct 8, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.