ETV Bharat / bharat

డబ్ల్యూహెచ్​ఓ బాస్​కు మోదీ 'నామకరణం'.. కొత్త పేరు ఏంటంటే... - తులసీభాయ్​

WHO director general new Name: గుజరాతీగా మారిపోయారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ టెడ్రోస్​ గెబ్రెయెసస్​ అధనోమ్​. ఆయనకు కొత్త పేరు పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇంతకీ కొత్త పేరు ఏమిటి?

WHO director general new Name
టెడ్రోస్​ అధనోమ్​, ప్రధాని మోదీ
author img

By

Published : Apr 20, 2022, 7:23 PM IST

WHO director general new Name: ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ టెడ్రోస్​ గెబ్రెయెసస్​ అధనోమ్​కు కొత్త పేరు పెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాంధీనగర్​లో జరుగుతున్న మూడు రోజుల గ్లోబల్​ ఆయూష్​ ఇన్వెస్ట్​మెంట్​, ఇన్నోవేషన్​ సమ్మిట్​ ప్రారంభోత్సవ వేదికగా.. బుధవారం టెడ్రోస్​ను 'తులసీ భాయ్​'గా పిలిచారు మోదీ. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. తులసి మొక్క భారత ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమని పేర్కొన్నారు. డాక్టర్​ గెబ్రెయెసస్​ తనకు గుజరాతీ పేరు కావాలని కోరినట్లు చెప్పారు.

"ఈరోజు ఉదయం టెడ్రోస్ నన్ను కలిసినప్పుడు తను పక్కా గుజరాతీగా మారిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. గుజరాతీ పేరు ఇవ్వాలని కోరారు. మహాత్మాగాంధీ నడయాడిన ఈ పుణ్యభూమిలో పుట్టిన నేను, ఒక గుజరాతీగా నా ప్రాణ స్నేహితుడిని తులసీ భాయ్​ అని పిలుస్తాను. తులసి మొక్క భారత ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగం.. తరతరాలుగా పూజలు చేస్తున్నాం. దీపావళి సమయంలో తులసి వివాహం ఉత్సవాలు నిర్వహిస్తాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఒక గుజరాతీకి భాయ్​ అనే పదం తప్పనిసరి అని పేర్కొన్నారు మోదీ. డాక్టర్​ గెబ్రెయెసెస్​ను తులసీ భాయ్​గా పిలవటం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే.. వేదికపై టెడ్రోస్​ అధనోమ్​ గుజరాతీలో మాట్లాడేందుకు ప్రయత్నించటం, చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పిన భారత ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవటంపై చాలా ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చూడండి: మోదీపై విమర్శలు చేసేది అలాంటి వారే: దిగ్గజ దర్శకుడు

60+ ఏజ్​లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్​స్టార్.. అంతా లాక్​డౌన్​ మేజిక్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.