దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రక్షా బంధన్(raksha bandhan) పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తమ తోబుట్టువులకు రాఖీలు(Rakhi 2021) కడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ట్విట్టర్ వేదికగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా దేశ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని ప్రజలను కోరారు.
"రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సోదరులు, సోదరీమణుల మధ్య ఉండే ప్రత్యేకమైన ఆత్మీయ ప్రేమానుబంధం, గౌరవానికి ప్రతీకగా ఈ వేడుక జరుపుకొంటారు. ఈ పర్వదినాన.. మనమంతా ఎల్లవేళలా మహిళల గౌరవం, సురక్షిత వాతావరణం కల్పించేందుకు కృషి చేద్దాం."
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
మరోవైపు.. దేశ ప్రజలందరికీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
దీదీ, మోదీ రాఖీలు..
బంగాల్లో రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఈసారి రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. సీఎం మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మలతో తయారైన రాఖీలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. అలాగే.. టీఎంసీ, భాజపా పార్టీ గుర్తులు ఉన్న రాఖీలు కూడా ఆకట్టుకుంటున్నాయి. మహిళలు తాము అభిమానించే పార్టీలు, నేతలకు చెందిన రాఖీలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.
![raksha bandhan celebrations in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12842530_as.jpg)
![raksha bandhan celebrations in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12842802_11.jpg)
![raksha bandhan celebrations in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12842802_22.jpg)
![raksha bandhan celebrations in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12842802_33.jpg)
ఇవీ చూడండి: