ETV Bharat / bharat

'రాజనీతిజ్ఞుడు.. మానవతా విలువలున్న వ్యక్తి కల్యాణ్ సింగ్' - మోదీ న్యూస్

కల్యాణ్​సింగ్​ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కల్యాణ్​​ సింగ్(Kalyan Singh news)​ గొప్ప రాజనీతిజ్ఞుడు మాత్రమే గాక మంచి అడ్మినిస్ట్రేటర్​ అని కొనియాడారు. పలువురు నేతలు కూడా కల్యాణ్​సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

kalyan singh
కళ్యాణ్ సింగ్
author img

By

Published : Aug 22, 2021, 12:22 AM IST

ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. కల్యాణ్​ సింగ్ దూరం కావడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందని అన్నారు.

తీవ్ర అనారోగ్య సమస్యలతో గత కొన్నాళ్లుగా బాధపడుతున్న కల్యాణ్​సింగ్.. లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస(Kalyan Singh news) విడిచారు.

"కల్యాణ్ సింగ్ రాజనీతిజ్ఞుడు, మానవతా విలువలున్న వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి గొప్ప నేతగా ఎదిగారు. ఉత్తర్​ప్రదేశ్​ అభివృద్ధిలో కల్యాణ్ సింగ్ పాత్ర ఎనలేనిది."

--నరేంద్ర మోదీ, ప్రధాని.

కల్యాణ్​ సింగ్​ తనయుడు రాజ్​వీర్ సింగ్​తో మాట్లాడిన మోదీ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

kalyan singh
కల్యాణ్​సింగ్ మృతి

ప్రముఖుల సంతాపం..

"కల్యాణ్​సింగ్​ ప్రజాధరణ కలిగిన నాయకుడు. యూపీ ముఖ్యమంత్రిగా, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఎదిగారు. అవినీతిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఓ మంచి నాయకుడిని కోల్పోయిన వెలితి ప్రజల్లో ఎప్పటికీ ఉంటుంది."

--రామ్​నాథ్ కోవింద్, రాష్ట్రపతి.

"కల్యాణ్‌సింగ్‌ దూరం కావడం చాలా బాధాకరం. ఆయన ఓ జాతీయవాది. అంకితభావంతో ప్రజలకు సేవ చేసిన నేత. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."

--వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.

"కల్యాణ్​సింగ్ మృతి వార్త కోట్లాది మందిని బాధించింది. ఆయన భాజపా సీనియర్ నేత మాత్రమే కాదు. రామజన్మభూమి ఉద్యమం హీరో కూడా. అనగారినవర్గాల వారి హక్కుల కోసం ఆయన ఏళ్ల పాటు పోరాటం చేశారు."

--అమిత్ షా, హోంమంత్రి.

23న అంత్యక్రియలు..

cabinet
కల్యాణ్​సింగ్ మృతిపట్ల సంతాపం తెలిపిన యూపీ కేబినెట్

శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన కల్యాణ్​ సింగ్​ అంత్యక్రియలు ఈ నెల 23న ఉత్తర్​ప్రదేశ్ నరోరాలోని​ గంగా నదీ ఒడ్డున జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించారు. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్టు, ఆగస్టు 23న సెలవు దినంగా ప్రకటించారు యోగి.

ఇదీ చదవండి:

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా అసమాన కీర్తి

ఆ 'ఘటన'తో కల్యాణ్​ సింగ్​ రాజకీయ ప్రస్థానం మలుపు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.