ETV Bharat / bharat

రాహుల్​ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష.. ఆరేళ్లు అనర్హత వేటు ఖాయమా?

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడింది. సూరత్ కోర్టు ఈమేరకు తీర్పు ఇచ్చింది. రాహుల్ అభ్యర్థన మేరకు ఆయనకు 30 రోజులు బెయిల్ ఇచ్చింది.

pm modi Rahul gandhi defame case verdict

author img

By

Published : Mar 23, 2023, 11:09 AM IST

Updated : Mar 23, 2023, 2:09 PM IST

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. గుజరాత్​ సూరత్​లోని న్యాయస్థానం గురువారం ఈమేరకు తీర్పునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 ఎన్నికల ప్రచారం వేళ కర్ణాటకలోని కోలార్​లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్​ను దోషిగా తేల్చింది. ఐపీసీ సెక్షన్​ 504 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ స్పష్టం చేశారు. ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష వేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, పైకోర్టుకు అప్పీల్​ చేసుకునేందుకు తనకు బెయిల్​ మంజూరు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ​ కోర్టును కోరారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. శిక్ష అమలును 30 రోజులు సస్పెండ్ చేసింది.

అంతకుముందు.. ఈ కేసులో రాహుల్​ గాంధీకి గరిష్ఠ శిక్ష వేయాలని పిటిషనర్​ పూర్ణేశ్ మోదీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా, తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదని రాహుల్​ కోర్టుకు నివేదించినట్లు ఆయన తరఫు న్యాయవాది జిగ్నేష్​ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న చీఫ్ జుడీషియల్​ మెజిస్ట్రేట్​ హెచ్​హెచ్​ వర్మ.. రాహుల్​ గాంధీకి రెండేళ్లు శిక్ష ఖరారు చేసింది.
మోదీ పరువు నష్టం కేసులో తుది తీర్పు నేపథ్యంలో వ్యక్తిగతంగా సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఉదయం సూరత్​ చేరుకున్న రాహుల్​కు పార్టీ సీనియర్​ నేతలు ఎయిర్​పోర్టుకు చేరుకుని కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికారు. నగరంలో పలు చోట్ల కాంగ్రెస్​ కార్యకర్తలు గుమిగూడి.. రాహుల్​కు సంఘీభావం తెలిపారు. హిందుస్థాన్​ సింహం (షేర్​-ఇ-హిందుస్థాన్​) అంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. 'బీజేపీ నిరంకుశత్వానికి కాంగ్రెస్​ ఎప్పుడూ తల వంచదు' అని రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు.

జడ్జీలను మారిస్తే ఇలాంటి తీర్పే వస్తుంది : కాంగ్రెస్​
సూరత్‌ జిల్లా కోర్టు తీర్పుపై రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. తన మతం.. సత్యం, అహింసపై ఆధారపడి ఉంటుందని ట్వీట్‌ చేసిన రాహుల్‌గాంధీ.. సత్యమే తన దైవమని.. దానిని పొందేందుకు అహింసే మార్గమని అన్నారు.
పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి శిక్ష విధించడంపై.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాహుల్‌కు ఇప్పటికే బెయిల్ మంజూరైందన్న ఖర్గే.. కేంద్రం, జడ్జీలను మారుస్తున్నప్పుడే ఇలాంటి తీర్పు వస్తుందని తమకు తెలుసన్నారు. తమకు చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్న ఖర్గే.. చట్ట ప్రకారం పోరాడతామని స్పష్టం చేశారు.

తీర్పును స్వాగతించిన బీజీపీ..
రాహుల్​పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్​ మోదీ తీర్పును స్వాగతించారు. "ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత.. రాహుల్​ గాంధీకి పార్లమెంట్​లో, పార్లమెంట్​ వెలుపలు అబద్దాలు చెప్పే అలవాటు ఉందని రుజువైంది" అని బీజేబీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్​ అన్నారు.

అనర్హత వేటు పడుతుందా?
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తిని.. నేరం రుజువైన తేదీ నుంచి రాజ్యాంగ పదువుల్లో ఉండటానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. వారు ఆరు సంవత్సరాల పాటు ఇలానే అనర్హులుగా ఉంటారు.

ఇదీ కేసు..
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్​. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన లలిత్‌ మోదీ, నీరవ్ మోదీని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీకి ముడిపెట్టారు. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీపై పరువు నష్టం దావా వేశారు గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. దీంతో రాహుల్​పై ఐపీసీ సెక్షన్లు 499, 500 కింద కేసు నమోదైంది.

Last Updated : Mar 23, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.