ETV Bharat / bharat

మెడికల్ ఆక్సిజన్​ ఉత్పత్తిని పెంచాలి: మోదీ - ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలో సరిపడా మెడికల్ ఆక్సిజన్​ సరఫరా కోసం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్​ కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ఆదేశించారు.

pm narendra modi,  oxygen
ప్రధాని నరేంద్ర మోదీ, ఆక్సిజన్
author img

By

Published : Apr 16, 2021, 3:38 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ప్రస్తుతమున్న పరిస్థితి సహా కేసులు అధికంగా నమోదవుతున్న12 రాష్ట్రాలలో వచ్చే 15 రోజులకు అవసరమయ్యే ఆక్సిజన్‌పై సమీక్షలో చర్చించారు.

పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యంపైనా ప్రధాని చర్చించారు. ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోదీ సూచించారు. ఇదే సమయంలో మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, రవాణా సంస్థలకు సూచించారు.

ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌ కేంద్రాలకు 24 గంటలు పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు మోదీ తెలిపారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌ దిగుమతికి చేస్తున్న ప్రయత్నాలను అధికారులు ప్రధానికి వివరించారు.

ఇదీ చూడండి: కరోనాతో ముందే ముగియనున్న కుంభమేళా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.