ETV Bharat / bharat

'ఆత్మనిర్భర్​ భారత్​కు సరకు రవాణా కీలకం' - modi news update

దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు సరకు రవాణా కారిడార్లు కీలకంగా వ్యవహరిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో నూతనంగా నిర్మించిన సరకు రవాణా కారిడార్లను ప్రారంభించారు.

PM Modi to inaugurate Eastern Dedicated Freight Corridor section today
'ఆత్మనిర్భర్​ భారత్​కు సరకు రవాణా కీలకం'
author img

By

Published : Dec 29, 2020, 12:05 PM IST

Updated : Dec 29, 2020, 12:12 PM IST

భారత్​ను ఆత్మనిర్భర్​గా మార్చేందుకు సరకు రవాణా కారిడార్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రైతులు, వ్యాపారులు, వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరూ దీనివల్ల ప్రయోజనం పొందుతారని చెప్పారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఈడీఎఫ్​సీ(ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్​)లో భాగంగా నిర్మించిన.. భూపుర్​- న్యూ-ఖుర్జ భాగాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు మోదీ. ప్రయాగ్​రాజ్​లో ఏర్పాటు చేసిన ఈడీఎఫ్​సీ ఆపరేషన్ కంట్రోల్​ను సైతం ఆవిష్కరించారు.

రూ. 5,750 కోట్లతో 351 కి.మీ మేర నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర్​ప్రదేశ్​లో స్థానిక పరిశ్రమలను అనుసంధానించేందుకు వీలు కలుగుతుంది.

Last Updated : Dec 29, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.