ETV Bharat / bharat

క్రీడలు హాబీలే కాదు.. అంతకు మించి: మోదీ - జమ్ముకశ్మీర్​ వింటర్​ గేమ్స్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుల్​మర్గ్​లో 2వ ఖేలో ఇండియా వింటర్​ గేమ్స్​ను వర్చువల్​గా ప్రారంభించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయన్నారు.

PM inaugurates Khelo India Winter Games, says will J&K winter sports hub
క్రీడలు హాబీలే కాదు.. అంతకు మించి: మోదీ
author img

By

Published : Feb 26, 2021, 12:34 PM IST

క్రీడలు కేవలం హాబీలే కాదని.. అవి బృంద స్ఫూర్తిని పెంపొందిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు, విజయం దిశగా అడుగులు వేసేందుకు మార్గాలు ఇస్తాయని పేర్కొన్నారు. మనలో ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తాయన్నారు.

జమ్ముకశ్మీర్​ గుల్​మర్గ్​లో 2వ ఖేలో ఇండియా వింటర్​ గేమ్స్​ను ప్రారంభించారు మోదీ. వర్చువల్​గా ఈ వేడుకకు హాజరైన ఆయన.. జమ్ముకశ్మీర్​ను వింటర్​ స్పోర్ట్స్​ హబ్​గా మార్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.

"'ఏక్​ భారత్​ శ్రేష్ఠ భారత్​'ను మెరుగుపరిచేందుకు ఈ క్రీడలు ఉపయోగపతాయి. ఈ ఏడాది పోటీదారులు పెరిగారని విన్నాను. దేశంలో క్రీడలకు ప్రాధాన్యం పెరుగుతోందని దీన్ని బట్టి అర్థమవుతుంది. వింటర్​ గేమ్స్​ భారత ఉనికిని అంతర్జాతీయంగా చాటుచెబుతాయి."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అనేకమంది అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. మార్చి 2వరకు వింటర్​ గేమ్స్​ సాగుతాయి.

ఇదీ చూడండి:- 'ఖేలో ఇండియా​'కు ముందు స్కీయర్ల విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.