ETV Bharat / bharat

ప్లంబర్ టు పేస్​ బౌలర్.. పేదింటి బిడ్డ క్రికెట్ ప్రయాణం! - prashant rana ranji trophy

Plumber to Pace bowler: కష్టేఫలి అనేది పెద్దలు చెప్పే నానుడి. ఒడిశాకు చెందిన యువకుడు ఈ నానుడిని నిజం చేశాడు. మనోబలంతో పనిచేస్తే సాధించలేనిదేది ఏదీ లేదని చాటిచెప్పాడు. నిరంతర శ్రమతో విజయాన్ని సొంతం చేసుకొని తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

prashant rana ranji trophy
prashant rana ranji trophy
author img

By

Published : Feb 15, 2022, 7:30 AM IST

Plumber to Pace bowler: నయాగఢ్ జిల్లా మాధపుర్​ గ్రామానికి చెందిన ప్రశాంత్ రానా.. ప్లంబర్​గా పనిచేస్తూనే తన కలను నెరవేర్చుకున్నాడు. రిపేర్లతోనే జీవితం ఆగిపోకూడదని నిశ్చయించుకొని.. తనకు నచ్చిన క్రికెట్​లో రాటు దేలాడు. తన నైపుణ్యాలకు పదునుపెట్టి.. ఒడిశా రంజీ ట్రోఫీ జట్టులో ఫాస్ట్​బౌలర్​గా స్థానం సంపాదించాడు.

prashant rana ranji trophy
ప్రశాంత్ రానా

Odisha Ranji trophy Prashant rana

అత్యంత పేద కుటుంబంలో జన్మించిన ప్రశాంత్ రానాకు.. చిన్నప్పటి నుంచి క్రికెట్​పై మక్కువ ఉండేది. స్కూల్​కు వెళ్లినా క్రికెట్ ఆడటం పైనే ధ్యాస. ఇలా చదువుకుంటూనే క్రికెట్​లో నైపుణ్యం సంపాదించాడు. అయితే, రానా తండ్రి సనాతన్​కు మాత్రం తన బిడ్డకు క్రికెట్​లో భవిష్యత్ ఉండదేమోనని మదన పడుతుండేవాడు. ఈ విషయంపైనే రానాతో గొడవపడేవాడు.

prashant rana ranji trophy
ఈ రేకుల ఇంట్లోనే నివాసం..
prashant rana ranji trophy
రానా తండ్రి, తల్లి

Prashant rana Odisha bowler

ఈ క్రమంలోనే తండ్రికి చేదోడుగా ఉండాలని నిర్ణయించుకొని చదువు పూర్తైన తర్వాత కటక్​కు వెళ్లి ప్లంబర్ పని చేయడం ప్రారంభించాడు రానా. అక్కడికి వెళ్లినా.. తన కలను మర్చిపోలేకపోయాడు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్లంబర్ పని చేస్తూనే.. కటక్ యూనియన్ స్పోర్టింగ్ క్లబ్​లో చేరి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అక్కడి కోచ్​లు, సిబ్బంది సహకారంతో తన బౌలింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకున్నాడు. ప్రశాంత్ పరిస్థితిని గమనించిన కోచ్​.. అతడికి ఆర్థికంగానూ అండగా నిలిచారు. అనంతరం ఇంటర్-డిస్ట్రిక్ట్ మ్యాచ్​లో పాల్గొని సెలెక్టర్లను ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు రానా. అనంతరం ఒడిశా క్రికెట్ అసోసియేషన్ నుంచి పిలుపు వచ్చింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు ప్రశాంత్ రానా ఎంపికైనట్లు ప్రకటించింది.

prashant rana ranji trophy
ప్రశాంత్ రానా
prashant rana ranji trophy
ప్రశాంత్ రానా

ఒకప్పుడు క్రికెట్ ఆడినందుకు తండ్రి చేతిలో దెబ్బలు తిన్న ప్రశాంత్ రానా.. ఇప్పుడు అదే ఆటతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రానా తల్లిదండ్రులు సైతం తన కుమారుడు సాధించిన ఘనతను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

prashant rana ranji trophy
ప్రశాంత్ రానా

ఇదీ చదవండి: రోజూలాగే విధులకు.. అంతలోనే పాపం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.