ETV Bharat / bharat

'లూడో'ను​ నిషేధించాలని హైకోర్టులో వ్యాజ్యం

author img

By

Published : Jun 6, 2021, 8:57 AM IST

Updated : Jun 6, 2021, 5:22 PM IST

లూడో గేమ్​ను నిషేధించాలంటూ బాంబే హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జూన్​ 22లోగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ludo game
లూడో గేమ్, బాంబే హైకోర్టు

లూడో మొబైల్​ గేమ్​కు సంబంధించి వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది బాంబే హైకోర్టు. లూడోను నిషేధించాలంటూ పిటిషన్​ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జూన్​ 22లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర నవ్​నిర్మాణ్ సేనా నేత కేశవ్ మూలే.. లూడో రూపకర్తలపై చర్యలు తీసుకోవాలని తొలుత పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించని కారణంగా.. మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. లూడోను నిషేధించాలని కోరారు.

అయితే లూడో.. నైపుణ్యం గల​ ఆట​ అని చెప్పి మూలే పిటిషన్​ను కోట్టేసింది మెజిస్ట్రేట్ కోర్టు. దీంతో.. గేమ్​ నిషేధంపై బాంబే హైకోర్టులో క్రిమినల్ పిటిషన్​ వేశారు మూలే. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ షిండే, జస్టిస్​ అభయ్ అహుజా నేతృత్వంలోని ధర్మాసనం.. లూడోకు సంబంధించిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

లూడో యువతను తప్పుదోవపట్టిస్తోందని పిటిషనర్​ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి:'అల్లోపతిలో కరోనిల్‌ చేరితే అది.. మిక్సోపతి'

Last Updated : Jun 6, 2021, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.