మహారాష్ట్రలో ఆలయాలు, ప్రార్థన స్థలాలు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. దీంతో భక్తులు భారీ సంఖ్యలో దేవాలయాలకు తరలివెళ్తున్నారు. దీపావళి తర్వాత ఆలయాలు తెరుచుకోవడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శిర్డీ సాయిబాబా ఆలయం తెరుచుకుంది. భక్తులు భారీగా వచ్చే అవకాశమున్న తరుణంలో.. కరోనా నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
రాష్ట్రప్రభుత్వ ఉత్తర్వులతో ముంబయిలో తెరుచుకున్న సిద్ధివినాయక ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు.
నాగ్‌పుర్‌లో కరోనా నిబంధనలను పాటిస్తూ.. తెరుచుకున్న శ్రీ గణేశ్ టెక్డీ దేవాలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలో పాల్గొన్నారు భక్తులు.
ముంబయిలోని మహిమ్ దర్గా తెరుచుకుంది. అయితే లోపలికి ప్రవేశించాలంటే మాస్కు, శానిటైజేషన్ వంటి కరోనా నిబంధనలు తప్పనిసరి చేసినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు.
ఉత్సవాల్లో పాల్గొనేవారు మాస్కులు, భౌతికదూరం వంటి కరోనా నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు అధికారులు.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో ఆలయాల పునఃప్రారంభానికి సీఎం గ్రీన్‌సిగ్నల్