ETV Bharat / bharat

Pir Panjal Terrorism : ఉగ్రవాదుల అడ్డాగా 'పీర్‌పంజాల్‌'.. రోజుల తరబడి ఎన్​కౌంటర్లు.. ఎందుకిలా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 6:37 AM IST

Pir Panjal Terrorism : జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో ఎదురుకాల్పులు కొన్నిరోజులు గడుస్తున్నా ఆగడం లేదు. పీర్‌పంజాల్‌ పర్వత శ్రేణుల్లో నక్కిన ముష్కరులు.. భద్రతాదళాలపై దాడులు చేస్తున్నారు. పీర్‌పంజాల్‌ పర్వతాలు.. ఉగ్రవాదులకు కేంద్రంగా మారాయి. అక్కడి భౌగోళిక స్వరూపం సైనిక ఆపరేషన్లకు అనుకూలంగా లేకపోవటం.. ముష్కరులకు వరంగా మారింది.

Pir Panjal Terrorism
Pir Panjal Terrorism

Pir Panjal Terrorism : జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా కొకెర్‌నాగ్‌ ప్రాంతంలోని పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణులు .. ఉగ్రమూకలకు అడ్డాగా మారాయి. గతంలో పాక్‌ సైనికమూకల ఆక్రమణకు నిలయంగా ఉన్న ఈ పర్వతాల్లో లష్కరే, జైషే ఉగ్రవాదులు ఉండేవారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఒక కర్నల్‌, మేజర్‌, కశ్మీరీ పోలీసు డీఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ జిల్లా నార్లా గ్రామంలో చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ రోజులు గడుస్తున్నా ముగియలేదు. అక్కడ ఉగ్ర కదలికలు ఉన్నట్లు తెలుసుకొని రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు గాలింపు చేపట్టారు.

ఉగ్రమూకను మట్టుబెట్టేందుకు..
Pir Panjal Range : లష్కరే కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌ వారిలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పర్వతశ్రేణుల పైభాగంలో నక్కిన ఉగ్రవాదులు.. అధికారులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. ఈ ఘటనలు పీర్‌పంజాల్‌ రేంజ్‌లో పెరిగిన ఉగ్ర కదలికలను చాటుతున్నాయి. ఉగ్రమూకను మట్టుబెట్టేందుకు అధికారులు డ్రోన్లు, ఐఈడీలను వాడాల్సి వస్తోంది. పీర్‌పంజాల్‌ రేంజిల్‌లోని పూంచ్‌, రాజౌరీల్లో ఇటీవలకాలంలో ఉగ్రదాడులు పెరిగాయి. పాక్‌ సరిహద్దు దాటుకొని వచ్చిన ఉగ్రవాదులు శ్రీనగర్‌ లేదా డోడా వెళ్లాలన్నా అనంతనాగ్‌ మీదుగా ప్రయణించాలి. దీంతో ముష్కరులకు ఇది ముఖ్యమైన స్థానంగా మారింది.

కశ్మీర్‌లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో పీర్‌ పంజాల్‌ పర్వశ్రేణులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడున్న బనిహాల్‌, హాజిపీర్‌, పీర్‌పంజాల్‌ పాస్‌లు అత్యంత కీలకమైనవి. దాదాపు 15వేల అడుగుల ఎత్తుండే ఈ పర్వశ్రేణుల భౌగోళిక స్వరూపం సైనిక అపరేషన్లకు ఏమాత్రం అనుకూలించదు. ఇక్కడి పరిస్థితి అఫ్గానిస్థాన్‌లోని పర్వతశ్రేణుల్లా ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతారు. చిక్కటి అడవులు కూడా ఉండడం వల్ల ఎంతపెద్ద దళానికైనా.. ఒకరు లేదా ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకోవాలన్నా భారీగా శ్రమించాల్సి వస్తుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ కూడా సమీపంలోనే ఉంటుంది.

2003లో ఆపరేషన్‌ సర్పవినాశ్‌ చేపట్టగా.. పూంచ్ నుంచి పీర్‌పంజాల్‌ పర్వతప్రాంతంలో భారీగా ఉగ్రస్థావరాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో హిల్‌కాకా ప్రాంతంలో వందల సంఖ్యలో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశారు. వేసవిలో గొర్రెల కాపరుల తెగకు చెందినవారు నిర్మించుకొన్న డోకే అనే నిర్మాణాలు ముష్కరులకు ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉగ్ర ఆపరేషన్లు పెరిగాయి. రాజౌరీ వద్ద చొరబాట్లను అడ్డుకోవడానికి.. సైన్యం దాదాపు 100 కిలోమీట్లరకుపైగా ఫెన్సింగ్‌ వేసింది. కానీ, హిమపాతం ఫెన్సింగ్‌ను ముంచేస్తుంది. భౌగోళిక పరిస్థితులు కూడా ఉగ్రవాదుల చొరబాట్లకు అనుకూలిస్తున్నాయి.

సాంకేతికత విషయంలో ఉగ్రవాదుల కొత్త ఎత్తులు..
Pir Panjal Terrorists : ఇటీవలకాలంలో సైనికదళాలు ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రాక్‌ చేస్తున్నాయి. దీంతో ఉగ్రవాదులు సాంకేతికత విషయంలో కొత్త ఎత్తులు వేస్తున్నారు. గతంలో టెర్రరిస్టులు ఒక ఇంట్లో స్థిరంగా ఆశ్రయం పొందేవారు. ఇప్పుడు తరచూ స్థావరాలను మార్చేస్తున్నారు. వారిని వేటాడం కష్టంగా మారింది. అదే సమయంలో కొత్త స్థావరాల్లో ఉగ్రమూక ముందే పొజిషన్లు తీసుకొని సిద్ధంగా ఉండటం వల్ల భద్రతాదళాలు ఎక్కువ ప్రాణనష్టం చవిచూస్తున్నాయి.

అనంత్‌నాగ్‌లో కూడా ఉగ్రవాదులు ఇంట్లో కాకుండా అడవుల్లో ఆశ్రయం పొందారు. మరోవైపు వైఎస్‌ఎంఎస్‌ టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. 2016, 2019లో జరిగిన భారీ ఉగ్రదాడుల్లో కూడా వాడారు. ఈ టెక్నాలజీలో వెరీ హైఫ్రీక్వెన్సీలో ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను పంపడం వల్ల వీటిని ట్రాక్‌ చేయడం దళాలకు కష్టంగా మారింది. స్మార్ట్‌ఫోన్లను రేడియో సెట్లకు అనుసంధానించి అత్యవసర సందేశాలు పంపడం, తమ లొకేషన్లను ఉగ్రబాస్‌లకు చేరవేయడం చేస్తున్నారు. స్థానికులను బెదిరించి వారి ఫోన్ల నుంచి ప్రత్యేక యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసి ఆ సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫొటోలను కూడా పంపుతున్నారు. పీర్‌ పంజాల్‌ ప్రాంతంలో పాక్‌ సెల్యూలర్‌ సర్వీసుల సిగ్నల్స్‌ కూడా బలంగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో సైన్యం, జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదులతో రోజుల తరబడి పోరాడాల్సి వస్తోంది.

కశ్మీర్​లో G20 సమావేశాలకు 'ఉగ్ర' బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం.. NSGతో ఎక్కడికక్కడ గస్తీ!

ట్రక్​పై డౌట్.. చెక్ చేసిన జవాన్లపై కాల్పులు.. గంట తర్వాత నలుగురు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.