కొవిడ్ కాలర్ ట్యూన్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ స్వరం అందించడాన్ని తప్పుపడుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అమితాబ్ స్వరంతో ఉన్న కాలర్ ట్యూన్‌ను తొలగించాలంటూ దిల్లీకి చెందిన రాకేశ్ అనే సామాజిక కార్యకర్త ఈ వ్యాజ్యం వేశారు. అయితే... పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరుకానందున విచారణను న్యాయస్థానం ఈనెల 18కి వాయిదా వేసింది.
"అమితాబ్ స్వరం అందించినందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. కానీ ఈ సేవలను ఉచితంగా అందించేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. చాలా మంది తమ కష్టార్జితాన్ని పేదలకు పంచారు. స్వరం అందించిన ఆయనకే కరోనా సోకింది."
-రాకేశ్, పిటిషనర్
సమాజ సేవకుడిగా కాదు..
అమితాబ్ ఓ సమాజ సేవకుడిగా దేశానికి సేవలు అందించట్లేదని పిటిషనర్ విమర్శించారు. ఈ విషయంపై గతేడాది నవంబరులోనే అధికారులకు ఫిర్యాదు చేశానని, కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రానందునే కోర్టును ఆశ్రయించానని అన్నారు.
ఇదీ చూడండి : బిగ్ బీ లద్దాఖ్ పర్యటన- నెటిజన్ల ఆవేదన!