ETV Bharat / bharat

గోవధ ఆర్డినెన్స్​పై కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు

గోవధ ఆర్డినెన్స్​పై కర్ణాటక హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. దీనిపై వివరణ కోరుతూ న్యాయస్థానం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

pil-against-cow-slaughtering-ordinance-hc-issued-notice-to-government
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
author img

By

Published : Jan 12, 2021, 7:03 PM IST

కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. గోవధపై జారీ చేసిన ఆర్డినెన్సును తప్పుపడుతూ ఆరిఫ్ జమీల్ అనే సామాజిక కార్యకర్త ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్​పై ఫిబ్రవరి 17లోగా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఆర్డినెన్స్​ పశు రవాణాకు ఇబ్బందిగా మారుతోందని, కాబట్టి దీనిపై స్టే విధించాలని పిల్​లో కోరారు జమీల్. పిటిషనర్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించగా.. కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. తదుపరి విచారణను కోర్టు జనవరి 18కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి : సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ: రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.