గరిట తిప్పడంపై మక్కువ ఉన్న వాళ్లు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కొన్నిసారు అవి క్లిక్ అవుతాయి, మరికొన్ని సార్లు బెడిసికొడతాయి. అయితే కొన్నిసార్లు ఆ ప్రయోగాలను చూస్తే.. 'అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా బాబు..' అనుకునే సందర్భాలూ ఉంటాయి. నెట్టింట్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. 'ఆలూ చిప్స్ కర్రీ'ని చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు.
-
Humanity has gone too far
— Ubrnhjdnenjkekehevbek (@Amol14551190) June 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Humanity has gone too far
— Ubrnhjdnenjkekehevbek (@Amol14551190) June 7, 2021Humanity has gone too far
— Ubrnhjdnenjkekehevbek (@Amol14551190) June 7, 2021
ఏంటిది...?
కోల్కతా ఫుడ్ ట్రోటర్స్ అనే ఫేస్బుక్ గ్రూప్లో ఈ ఆలూ చిప్స్ కర్రీ ఫొటోను పెట్టారు. ఆలూ చిప్స్, టమాటా గ్రేవీ, పచ్చిమిర్చితో ఈ కర్రీ ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఆలు అంటే చాలా మందికి ఇష్టమే. ఆలూ చిప్స్ అంటే కొందరిలో పిచ్చి కూడా ఉంటుంది. అలాంటిది దానిని కర్రీ రూపంలో చూసేసరికి విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 'ఇది కచ్చితంగా హత్యా ప్రయత్నమే. ఇందుకు కనీసం 14 సంవత్సరాల జైలు శిక్ష వెయ్యాలి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మానవత్వం ప్రమాదంలో ఉంది' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'ఆలూ చిప్స్ చాలా బాగుంటాయి.. కానీ వాటితో కర్రీ చేయడం ఏంటి?' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి: 'పాప్కార్న్ సలాడ్'.. ఇదేం ఐడియా తల్లీ!