ETV Bharat / bharat

ఆన్​లైన్ క్లాసు మధ్యలో పేలిన ఫోన్​.. విద్యార్థికి తీవ్ర గాయాలు

Phone Blast: ఆన్​లైన్ క్లాసు జరుగుతుండగా ఓ విద్యార్థి చేతిలోని ఫోన్ పేలింది. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

phone blast during online classes
ఆన్​లైన్ క్లాసు మధ్యలో పేలిన ఫోన్
author img

By

Published : Dec 17, 2021, 8:28 PM IST

Updated : Dec 17, 2021, 10:49 PM IST

ఆన్​లైన్ క్లాసు మధ్యలో పేలిన ఫోన్​

Phone Blast: మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఆన్​లైన్ క్లాసులు జరుగుతుండగా ఫోన్ పేలి.. ఓ 15 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అసలేం జరిగిందంటే..?

చంద్ కుయియా గ్రామానికి చెందిన రామ్​ప్రకాశ్ భదౌరియా 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అతడు ఫోన్​లో ఆన్​లైన్ క్లాసులకు హాజరయ్యాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా అతడి చేతిలోని ఫోన్ పేలింది. దీంతో అతని దవడకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని నగోడ్ పోలీస్ స్టేషన్ ఇన్​స్పెక్టర్ ఆర్​పీ మిశ్రా తెలిపారు.

phone blast during online class
గాయపడ్జ రామ్​ప్రకాశ్ భదౌరియా
phone blast
అంబులెన్సులో విద్యార్థి

"ఘటనా సమయంలో ఇంట్లో రామ్​ప్రకాశ్ ఒక్కడే ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఫోన్​ పేలడం వల్ల.. భారీ శబ్దం వినిపించగా చుట్టుపక్కల వారు రామ్​ప్రకాశ్ వద్దకు చేరుకున్నారు. స్థానికులు అతడిని సత్నా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జబల్​పుర్​కు తరలించారు" అని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: CCTV Video: దొంగల బీభత్సం.. మహిళ ఫోన్​ కొట్టేసి.. స్కూటీపై వేగంగా ఈడ్చుకెళ్లి..

ఇదీ చూడండి: భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!

Last Updated : Dec 17, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.