ETV Bharat / bharat

'పన్నుల వసూళ్లలో కేంద్రం పీహెచ్​డీ' - పెట్రోల్ రేట్ల పెరుగుదలపై రాహుల్ ఆవేదన

పన్నుల కంటే పెట్రోల్​, డీజిల్​పైనే కేంద్రానికి అధిక ఆదాయం సమకూరిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ' ప్రజల నుంచి పన్ను వసూలు చేయటంలో కేంద్రం పీహెచ్​డీ చేసిందని' ఎద్దేవా చేశారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Jun 20, 2021, 2:28 PM IST

దేశంలో ఇంధన ధరలు అంతకంతకూ పెరగడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్​ ధర రూ. 100 దాటడంపై ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

rahul tweet
పత్రిక కథనాన్ని ట్వీట్​ చేసిన రాహుల్
rahul tweet
రాహుల్ గాంధీ ట్వీట్

"ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నుల కంటే పెట్రోల్, డీజిల్​ పైనే కేంద్ర ఖజానాకు అధిక ఆదాయం తరలింది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయటంలో కేంద్రం పీహెచ్​డీ చేసింది."

-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ప్రస్తుతం భోపాల్​లో అత్యధికంగా లీటరు పెట్రోల్​ రూ. 105.43 ఉంది. ముంబయిలో రూ. 103.36, పట్నాలో రూ. 99.28, దిల్లీలో రూ. 97.22 గా ఉంది.

ఇదీ చదవండి : Rahul Gandhi: 'పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టంలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.