కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని విట్టల్ గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదాతలకు పండ్ల రసాలకు బదులు పెట్రోల్‌ను కానుకగా ఇచ్చారు నిర్వాహకులు.
ఆ లక్ష్యంతోనే..
కరోనా వైరస్ వల్ల రక్తదానం ఇవ్వడానికి చాలామంది వెనుకాడుతున్నారు. రక్తం కొరతతో ఆసుపత్రులు ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. అందుకే ఎక్కువ మంది రక్తదాతలను ఆకర్షించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు నిర్వాహకులు. పండ్ల రసాలకు బదులు పెట్రోల్‌ను ఇస్తే ఎక్కువమంది రక్తదాతలు ముందుకు వస్తారని ఆశించారు. ఆదివారం మొదటి 50 మంది రక్తదాతలకు ఒక లీటర్ చొప్పున పెట్రోల్ లేదా డీజిల్‌ను కానుకగా ఇచ్చారు. కూపన్లను కానుకగా పొందిన రక్తదాతలు వెంటనే పెట్రోల్ బంక్‌కు వెళ్లి తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకున్నారు.
ఇదీ చదవండి: టోల్ ఛార్జీ కట్టకుండా స్కెచ్- హైవే పక్కనే మరో రోడ్