ETV Bharat / bharat

గ్రాండ్​గా కుక్క బర్త్​డే పార్టీ.. 100కేజీల కేక్​ కటింగ్.. ఐదు వేల మందికి భోజనాలు - బెళగావిలో ఘనంగా పెంపుడు కుక్క జన్మదిన వేడుకలు

కర్ణాటకలో ఓ పెంపుడు శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఓ యజమాని. ఏకంగా 100 కేజీల కేక్​ను కట్​ చేశారు. అలాగే 5,000 మందికి భోజనాలు పెట్టారు. ఇంత ఘనంగా వేడుకలు చేయడం వెనుక ఓ పెద్ద పొలిటికల్ కథ ఉందట. అదేంటో తెలుసుకుందామా?

pet dog birthday Belagavi
పెంపుడు కుక్కతో 100 కేజీల కేక్ కట్ చేయిస్తున్న యజమాని శివప్ప
author img

By

Published : Jun 23, 2022, 6:30 PM IST

పెంపుడు కుక్కలపై యజమానులకు ప్రేమ సహజమే. వాటిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు. కొందరు సరదాగా బర్త్​డే పార్టీలు కూడా చేస్తుంటారు. కానీ కర్ణాటకకు చెందిన వ్యక్తి ఓ వ్యక్తి మాత్రం అవమానకర వ్యాఖ్యలకు సమాధానంగా కుక్క పుట్టిన రోజు సంబరాలు ఘనంగా నిర్వహించాడు.

pet dog birthday Belagavi
పెంపుడు కుక్కతో 100 కేజీల కేక్ కట్ చేయిస్తున్న యజమాని శివప్ప
బెళగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి ఈ పెంపుడు కుక్క 'క్రిష్​'కు యజమాని. క్రిష్​ పుట్టిన రోజు వేడుకలకు గ్రామంలోని 5,000 మందిని పిలిచాడు. 100 కిలోల కేక్​ను కట్​ చేశాడు. పసందైన విందును గ్రామస్థులకు ఏర్పాటు చేశాడు. 300 కేజీల మాంసం, 100 కేజీల గుడ్లను అతిథులకు వండిపెట్టారు. శాకాహారులకు 50 కేజీల కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం పెంపుడు కుక్క క్రిష్​ను​ ఘనంగా ఊరేగించారు.
pet dog birthday Belagavi
విందు బోజనాలు చేస్తున్న గ్రామస్థులు
శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామ పంచాయతీ సభ్యుడు. ఓ సారి కొత్త పంచాయతీ సభ్యుడు తన పుట్టిన రోజు వేడుకల్లో పాత పంచాయతీ సభ్యులపై అవమానకరంగా వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రభుత్వ హయాంలో పాత పంచాయతీ సభ్యులు కుక్కల్లా తిన్నారని కించపరిచాడు. ఈ సభ్యుడి వ్యాఖ్యలకు నిరసనగా శివప్ప తన పెంపుడు కుక్కకు ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాడు.
pet dog birthday Belagavi
పెంపుడు కుక్క క్రిష్ బర్త్​డే సందర్భంగా 100 కేజీల కేక్

ఇవీ చదవండి: జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడి​పైనే ఆశలు.. ఈటీవీ భారత్​ కథనంతో...

మహిళ తాకితే స్పృహ కోల్పోతున్న పూజారి.. అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.