ETV Bharat / bharat

'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!' - రామాలయ నిర్మాణం ప్రత్యక్ష వీక్షణ

అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసే యాచనలో ఉన్నట్లు తెలిపారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి. పునాది పనులు పూర్తైన తర్వాత ఆ దిశగా అడుగులు వెేయనున్నట్లు ఈటీవీ భారత్​కు వెల్లడించారు. 100 అడుగుల లోతు, 1200 స్తంభాలతో ప్రస్తుతం బేస్​మెంట్​ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

'People will be able to see construction of Ram Mandir live'
'అయోధ్య రామందిర నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు'
author img

By

Published : Nov 3, 2020, 11:50 AM IST

అయోధ్యలో చారిత్రక రామమందిర నిర్మాణాన్ని ప్రజలు త్వరలోనే ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. పునాది పనులు పూర్తయ్యాక ఈ మేరకు ఏర్పాట్లు చేసే ఆలోచనలో ఉన్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి ప్రకాశ్​ గుప్తా తెలిపారు. ఈటీవీ భారత్​తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం పునాది పనులు జరుగుతున్నాయని.. 100 మీటర్ల లోతు, 1200 స్తంభాలతో దీన్ని పూర్తి చేసేందుకు సమయం పడుతుందని చెప్పారు.

ప్రకాశ్​ గుప్తా, రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి

ఆలయ పునాది నిర్మాణం పూర్తైన తరువాత ప్రజలు కళ్లారా రామమందిర నిర్మాణం తిలకించవచ్చు. దీని కోసం ఆలయానికి కొద్ది దూరంలో ఓ వేదికను నిర్మిస్తాం. ఇది జరగడానికి ఇంకో ఏడాది సమయం పట్టొచ్చు. కానీ ప్రజలు కళ్లెదురుగా రామాలయ కట్టడం జరుగుతుంది.

-ప్రకాశ్ గుప్తా, రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.