ETV Bharat / bharat

లాక్​డౌన్​ ప్రకటనతో లిక్కర్ షాపుల ముందు బారులు

లాక్​డౌన్​ ప్రకటనతో లిక్కర్​ షాపులకు పోటెత్తారు మద్యం ప్రియులు. కరోనా భయాలను పక్కన పెట్టి పెద్ద సంఖ్యలో దుకాణాల వద్దకు చేరుకున్నారు. ఈ దృశ్యాలు బంగాల్​లోని కోల్​కతా నగరంలో కనిపించాయి. ఏ లిక్కర్​ షాప్​ ముందు చూసినా పెద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి.

liquor shops
మద్యం దుకాణాల ముందు బారులు
author img

By

Published : May 15, 2021, 7:33 PM IST

కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్​డౌన్​, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగాల్​లో​ ఆదివారం నుంచి రెండు వారాల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. లాక్​డౌన్​ సమయంలో లిక్కర్​ షాపులు సైతం మూసి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు.

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి లాక్​డౌన్​ అమలులోకి వస్తుందన్న నేపథ్యంలో లిక్కర్​ దుకాణాలకు పోటెత్తారు మద్యం ప్రియులు. కోల్​కతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపించాయి. షాపు వద్ద భారీగా గుమిగూడిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో పురుషులతో పాటు మహిళలు పోటీపడ్డారు.

liquor shops
మద్యం దుకాణాల ముందు బారులు
liquor shops
మద్యం దుకాణాల ముందు బారులు
liquor shops
మద్యం దుకాణాల ముందు బారులు

ఇదీ చూడండి: గూగుల్​ మ్యూజియంలో సరికొత్త మాస్క్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.