ఎక్కువ మందికి టీకా అందించేందుకు.. కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ సమయంపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ప్రజలు వారికి అనువైన సమయంలో 24x7 ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని వెల్లడించారు.
దేశ పౌరుల ఆరోగ్యంతో పాటు సమయానికి ఉన్న విలువను ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ట్వీట్ చేశారు.
-
सरकार ने #vaccination की रफ़्तार बढ़ाने के लिए समय की बाध्यता समाप्त कर दी है। देश के नागरिक अब 24x7अपनी सुविधानुसार टीका लगवा सकते हैं।
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
PM श्री @narendramodi जी देश के नागरिकों के स्वास्थ्य के साथ-साथ उनके समय की कीमत बखूबी समझते हैं।#VaccineAppropriateBehavior pic.twitter.com/cpKVlXurvL
">सरकार ने #vaccination की रफ़्तार बढ़ाने के लिए समय की बाध्यता समाप्त कर दी है। देश के नागरिक अब 24x7अपनी सुविधानुसार टीका लगवा सकते हैं।
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2021
PM श्री @narendramodi जी देश के नागरिकों के स्वास्थ्य के साथ-साथ उनके समय की कीमत बखूबी समझते हैं।#VaccineAppropriateBehavior pic.twitter.com/cpKVlXurvLसरकार ने #vaccination की रफ़्तार बढ़ाने के लिए समय की बाध्यता समाप्त कर दी है। देश के नागरिक अब 24x7अपनी सुविधानुसार टीका लगवा सकते हैं।
— Dr Harsh Vardhan (@drharshvardhan) March 3, 2021
PM श्री @narendramodi जी देश के नागरिकों के स्वास्थ्य के साथ-साथ उनके समय की कीमत बखूबी समझते हैं।#VaccineAppropriateBehavior pic.twitter.com/cpKVlXurvL
మంగళవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రులతో సమావేశంలో ఇదే విషయం చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. వ్యాక్సిన్ పంపిణీ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనేది తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాత కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి టీకా పంపిణీ చేయొచ్చని వివరించారు.
తొలి డోసు తీసుకున్న కరోనా యోధులకు ఫిబ్రవరి 13 నుంచి కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి వ్యాక్సినేషన్ రెండో దశను ప్రారంభించారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు అంతకన్నా ఎక్కువ ఉండి ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.56 కోట్ల డోసులు ఇచ్చారు.
ఇదీ చూడండి: కొవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి, సీఎంలు