ETV Bharat / bharat

'ప్రభుత్వాన్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు' - బృందా కారట్​ ఈటీవీ భారత్​

సీపీఎం​ జాతీయ నేత బృందా కారాట్​.. తమిళనాడు కోవిల్​పట్టిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అన్నాడీఎంకేను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

People are not ready to believe ADMK freebies - CPM national leader brinda karat
'అన్నాడీఎంకేను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు'
author img

By

Published : Mar 30, 2021, 4:28 PM IST

ప్రజలకు ఎంతో చేసినట్టు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. నిజానికి అంబానీ-అదానీకి తప్ప ఎవరికీ ఏమీ చేయలేదని ఆరోపించారు సీపీఎం​ జాతీయ నేత బృందా కారాట్​. వారికి రూ. 11లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని పేర్కొన్నారు.

తమిళనాడు కోవిల్​పట్టిలో సీపీఎం​ అభ్యర్థి శ్రీనివాసన్​ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు కారాట్​. అనంతరం ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని మరోమారు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని విమర్శించారు. ఆ పార్టీ హామీలనూ ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు. భాజపా చేతిలో అన్నాడీఎంకే కీలు బొమ్మగా మారిపోయిందని పేర్కొన్నారు కారాట్​.

'ప్రభుత్వాన్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు'

కోవిల్​పట్టి నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా రాష్ట్రమంత్రి కదంపుర్​ రాజు నిలిచారు. ఏఎం​ఎం​కే అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్​ బరిలో దిగారు. ఇక డీఎంకే పొత్తుతో సీపీఎం​ నుంచి శ్రీనివాసన్​ ఎన్నికల్లో నిలిచారు.

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితంగా డీఎంకే కూటమికి ఈసారి అధికారం కచ్చితంగా దక్కుతుందన్నారు కారాట్​.

234 నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:- తమిళ పోరు: పార్టీల నోట 'మద్య నిషేధం' మాట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.