ETV Bharat / bharat

'అత్యంత అయోమయ స్థితిలో దేశం'

కొవిడ్‌ నియంత్రణపై కేంద్రం తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అమికస్‌ క్యూరీగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే.. తనను ఈ కేసు నుంచి తప్పుకునేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం అంగీకరించింది. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

SC
సుప్రీం కోర్టు, బోబ్డే
author img

By

Published : Apr 23, 2021, 12:27 PM IST

Updated : Apr 23, 2021, 9:38 PM IST

దేశంలో కరోనా కల్లోలంపై సుమోటోగా చేపట్టిన కేసు విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ కేసును శుక్రవారం పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకుగాను కేంద్రం మరింత గడువు కోరడం వల్ల విచారణ వాయిదా వేసింది.

తప్పుకున్న అమికస్​ క్యూరీ..

ఈ విచారణ నుంచి ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే అమికస్‌ క్యూరీగా తప్పుకొన్నారు. దేశం ప్రస్తుతం అత్యంత అయోమయ స్థితిలో ఉందన్న సాల్వే.. న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత క్లిష్టమైన విచారణ ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే తనకు ఎప్పటినుంచో తెలిసి ఉన్నందున ఈ విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్లు తెలిపారు.

తొలుత సాల్వే నియామకంపై ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణ ప్రారంభమైన వెంటనే అమికస్‌ క్యూరీగా తప్పుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఆయన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. అయితే ఆయన నియామకం.. ధర్మాసనం ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమే అని తెలిపింది. ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మోహతా మాట్లాడుతూ.. సాల్వే తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు.

సుప్రీం అసంతృప్తి..

గురువారం తాము జారీచేసిన ఉత్తర్వులను పరిశీలించకుండా విమర్శలు చేసిన పలువురు సీనియర్‌ న్యాయవాదుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవిడ్‌ నిర్వహణకు సంబంధించి హైకోర్టుల్లో దాఖలైన కేసుల విచారణను తాము ఆపలేదని స్పష్టం చేసింది.

ఆక్సిజన్‌ సరఫరా, కొవిడ్‌ చికిత్సకు అవసరమయ్యే మందుల లభ్యత, టీకా పంపిణీకి సంబంధించి జాతీయ విధానం ప్రకటించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధింపునకు సంబంధించి హైకోర్టులకు ఉన్న న్యాయపరమైన అధికారాలపైనా.. సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేయనుంది.

ఇదీ చదవండి:గంగా నదిలోకి దూసుకెళ్లిన జీపు- 10 మంది గల్లంతు

Last Updated : Apr 23, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.