పెగసస్(pegasus spyware) ద్వారా ప్రజాస్వామన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడాన్ని(pegasus supreme court) స్వాగతించారు. సైబర్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం కీలక ముందడుగు అన్నారు. దీని వల్ల నిజానిజాలు కచ్చితంగా బయటకు వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు(rahul gandhi on pegasus).
పెగసస్ స్పైవేర్‌ను(pegasus spyware india) ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోంమంత్రి అమిత్ షా కొనుగోలు చేసి ఉండాలని రాహుల్ ఆరోపించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యవహారంపై కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించారు.
1. పెగసస్‌ను ఎవరు కొనసుగోలు చేశారు? ఏ సంస్థ దీన్ని ఉపయోగిస్తోంది? ఎవరికి దీనిపై అధికారం ఉంది? పెగసస్‌ను ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేయలేరు. కాబట్టి కచ్చితంగా ప్రభుత్వమే కొనుగులు చేసి ఉండాలి.
2. పెగసస్‌ను ఎవరిపై ఉపయోగించారు?
3. మన దేశ పౌరులకు సంబంధించిన సమాచారం వేరే దేశాలకు వెళ్తుందా?
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పెగసస్(pegasus spyware news) అంశాన్ని మరోసారి లేవనెత్తుతామని రాహుల్ స్పష్టం చేశారు. గత సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ దీనిపై చర్చకు పట్టుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి కూడా దీనిపై చర్చకు భాజపా కచ్చితంగా ఒప్పుకోదని జోస్యం చెప్పారు.
పెగసస్ స్పైవేర్(pegasus spyware india) ద్వారా సీఎంలు, మాజీ ప్రధానులు, భాజపా మంత్రులపై కూడా నిఘా ఉంచారని రాహుల్ ఆరోపించారు. పెగసస్ ద్వారా సేకరించిన డేటా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులు, ఎన్నికల అధికారుల ఫోన్ ట్యాపింగ్ వివరాలు మోదీ వద్దకు వెళ్తే.. అది కచ్చితంగా క్రిమినల్ చర్యే అవుతుందన్నారు.
ఏంటీ పెగాసస్..?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందు పెగసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెగసస్ స్పైవేర్‌తో లక్ష్యంగా చేసుకున్న వారిలో సుమారు 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేత, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు కేంద్రమంత్రులు, పాత్రికేయులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బుధవారం ముగ్గురు సభ్యులతో కూడిన సైబర్ నిపుణు కమిటీని ఏర్పాటు చేసింది. వ్యక్తిగత గోప్యత పౌరుల హక్కు అని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: పెగసస్‌పై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు- సుప్రీం ఉత్తర్వులు