ETV Bharat / bharat

'ప్రజల గొంతు నొక్కే ఆయుధమే 'పెగసస్​''

దేశ ప్రజలు.. నిజం మాట్లాడుకుండా ఉండేందుకు పెగసస్​ను ఓ ఆయుధంలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వినియోగిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ అధికారంలో ఉన్నంత కాలం.. దేశ యువతకు ఉద్యోగాలు దొరకవని చెప్పారు.

rahul gandhi
రాహుల్ గాంధీ
author img

By

Published : Aug 5, 2021, 3:25 PM IST

పెగసస్​ వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల గొంతు నొక్కేందుకు పెగసస్​ స్పైవేర్​ను ఆయుధంలా మోదీ ఉపయోగించారని ఆరోపించారు. భారతీయ యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో దిల్లీలో నిర్వహించిన 'సంసద్​ ఘెరావ్'​ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. దేశంలో నిరుద్యోగ సమస్యపైనా రాహుల్​ విమర్శలు చేశారు.

"కేవలం నా ఫోన్​లోనే కాదు.. ప్రతి భారతీయ యువకుడి ఫోన్​లో పెగసస్​ స్పైవేర్​తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిఘా పెట్టారు. మీరు నిజం మాట్లాడితే.. పెగసస్​, నరేంద్ర మోదీ పసిగడతారు. ప్రజలను మౌనంగా ఉంచేందుకు పెగసస్​ను వినియోగిస్తున్నారు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

దేశ ప్రజలు నిజం మాట్లాడిన రోజున మోదీ ప్రభుత్వం కుప్పకూలుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నంతకాలం.. దేశ యువతకు ఉద్యోగాలు దొరకవని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'ఆ వార్తలు నిజమైతే.. 'పెగసస్​'ను తీవ్రంగా పరిగణిస్తాం'

ఇదీ చూడండి: సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ల ఫోన్లపైనా నిఘా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.