ETV Bharat / bharat

'యుద్ధ సామర్థ్యం ఉంటేనే శాంతి స్థాపన సాధ్యం' - భారత్ చైనా యుద్ధం

యుద్ధాన్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉంటేనే శాంతికి కృషి చేయగలమని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఉద్ఘాటించారు. దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవటంపై భారత్ దృఢ నిశ్చయంతో ఉందన్నారు. చర్చల ద్వారానే విభేదాలను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.

rajnath
రాజ్​నాథ్​ సింగ్
author img

By

Published : Nov 5, 2020, 1:57 PM IST

సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత కాపాడుకోవటంలో భారత్​ దృఢ నిశ్చయంతో ఉందని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఏకపక్ష ధోరణి, దుందుడుకు చర్యలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.

నేషనల్​ డిఫెన్స్ కాలేజీ నిర్వహించిన వర్చువల్ సెమినార్​లో పాల్గొన్న రాజ్​నాథ్​.. సరిహద్దుల్లో శాంతికి సంబంధించిన ఒప్పందాలను గౌరవిస్తామని చెప్పారు. విభేదాల విషయంలో చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారానికి ప్రాముఖ్యం ఇస్తామని స్పష్టం చేశారు.

చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్ని ఏడు నెలలు కావొస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు రక్షణ మంత్రి.

"భారత్ శాంతికాముక దేశం. విభేదాలు వివాదాలుగా మారకూడదని నమ్ముతుంది. యుద్ధాన్ని నివారించే లేదా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నప్పుడే శాంతి కోసం కృషి చేయగలం. ఇందుకోసం స్వదేశీకరణ మంత్రంతో ముందుకు సాగుతున్నాం."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

ఇదే వేదికగా.. పాకిస్థాన్​ తీరుపైనా విమర్శలు చేశారు రాజ్​నాథ్​. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా మొండిగా అనుసరిస్తోందని ఆరోపించారు.

భారత్, చైనా మధ్య మే 6న మొదలైన సరిహద్దు వివాదాలపై ఇప్పటికీ సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ, ప్రతిష్టంభనకు తెరపడలేదు. భారత్, చైనా మధ్య 8వ దఫా చర్చలు శుక్రవారం జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'చైనా ఆక్రమణ' వ్యాఖ్యలపై రాజ్​నాథ్ మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.